కేసీఆర్ తో ఫ్రెండ్ షిప్ మంచిదే : జగన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేసీఆర్ తో ఫ్రెండ్ షిప్ మంచిదే : జగన్

విజయవాడ, జూలై 25 (way2newstv.com):
ప్రస్తుతం తెలంగాణకే నీరు రాని పరిస్థితి ఉందంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. కేవలం 12శాతం గోదావరి నీళ్లు మాత్రమే ఏపీలోకి వస్తున్నాయని.. కేవలం ఐదు టీఎంసీలు మాత్రమే ఏపీ ఆధీనంలో ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీట పంపకాలు, గోదావరి జలాల వినియోగంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. టీడీపీ చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం ఇచ్చారు. నీటి వినియోగంపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. కేవలం 12 శాతం గోదావరి నీళ్లు మాత్రమే ఏపీలోకి వస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. గోదావరి జలాల వినియోగంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా జగన్ మాట్లాడారు. 
కేసీఆర్ తో ఫ్రెండ్ షిప్ మంచిదే : జగన్

కేవలం ఐదు టీఎంసీలు మాత్రమే మన ఆధీనంలో ఉంటాయని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించి పూర్తి చేశారన్నారు. ప్రాజెక్ట్ కడుతుంటే ఇక్కడ చంద్రబాబు ఉండి ఏం చేయగలిగారని నిలదీశారు. మనది దిగువ రాష్ట్రం.. ఎగువ రాష్ట్రం వదిలితేనే మనకు నీళ్లు వస్తాయని చెప్పారు. ఇప్పటికే కృష్ణా జలాల విషయంలో ఏం జరుగుతోందో చూస్తూనే ఉన్నామని తెలిపారు. గుట్టల మధ్య డ్యాములు కట్టే కాలం పోయిందన్నారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ బ్యారేజీలు కడుతున్నారని వివరించారు. కాళేశ్వరం దిగువన 17 బ్యారేజీలు కట్టారని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యత అవసరమని వ్యాఖ్యానించారు. తెలుగు వాళ్లమంతా ఒకటిగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మంచి వాడు అంటూ జగన్ కితాబిచ్చారు. కేసీఆర్‌ సహకారంపై హర్షించాల్సిందిపోయి దాన్ని కూడా వక్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల తర్వాత మన పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం లేదంటూ మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నా లాభం లేదని విమర్శించారు. సాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్లు రెండు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తి అని పేర్కొన్నారు. కలిసి కట్టుగా అడుగులు వేస్తే ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కరవుతో జిల్లాలు అల్లాడుతుంటే.. రాజకీయాలే కావాలి అన్నట్లుగా టీడీపీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తన చూస్తుంటే.. మనుషులు అనలా..రాక్షసులు అనలా అర్ధంకావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మాత్రం ప్రతిపక్షం సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పుకొచ్చారు.