ప్రమాదంలో పడ్డ ప్రజాస్వామ్యం :సీఎల్పీ నేత భట్టి

హైదరాబాద్‌ జూలై 18 (way2newstv.com)
తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అప్రజాస్వామికంగా తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో చాలా సమస్యలున్నా వాటి మీద చర్చించకుండా.. కేసీఆర్‌కు ఇష్టమైన పలుకులు వినడానికే సభను ఏర్పాటు చేసుకున్నట్లుగా ఉందని ఎద్దేవాచేశారు. 
ప్రమాదంలో పడ్డ ప్రజాస్వామ్యం :సీఎల్పీ నేత భట్టి 

తమకు సభలో మైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం కోర్టులో ఉన్న అంశమని, దీనిపై స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని నిలదీశారు. కేసీఆర్‌కు మున్సిపల్‌ ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల మీద లేదన్నారు. అసెంబ్లీ సెషన్‌ను పొడిగించి ప్రజా సమస్యలపై చర్య పెట్టాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. తెరాసలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ నల్లకండువాలతో వచ్చామన్నారు.
Previous Post Next Post