పార్లమెంట్ ఆవరణలో మొక్కలు నాటిన ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, పాల్గొన్న తెలంగాణ ఎం.పీలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పార్లమెంట్ ఆవరణలో మొక్కలు నాటిన ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, పాల్గొన్న తెలంగాణ ఎం.పీలు

పార్లమెంట్ ఆవరణలో తెలంగాణకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన మన ఎంపీలు
పాల్గొన్న టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా, ఎం.పీలు కేకే, సంతోష్, బండ ప్రకాష్
ఇతర రాష్ట్రాలకు చెందిన సహచర ఎంపీలకు తెలంగాణకు హరితహారం వివరాలు వెల్లడి
తాను రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్దికి దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడించిన రాజ్యసభ ఎం.పీ సంతోష్  
న్యూఢిల్లీ,జూలై 26, (way2newstv.com)
పార్లమెంట్ ఆవరణలో శుక్రవారం  మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ఎం.పీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  హరితహారంలో భాగంగా తెలంగాణకు చెందిన ఎంపీలు కూడా స్వయంగా మొక్కలు నాటారు.  తెలంగాణ ఎం.పీల ఆహ్వానం మేరకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ, అడవులు, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ లు మొక్కలు నాటారు.  
పార్లమెంట్ ఆవరణలో మొక్కలు నాటిన ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, పాల్గొన్న తెలంగాణ ఎం.పీలు

రాజ్యసభ ఎంపీలు కేకే, సంతోష్ రావు, బండ ప్రకాశ్ ముదిరాజ్, ఎంపీ సుప్రియా సూలే, మరో ఎం.పీ, నటి సమలత లు కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తెలంగాణకు హరితహారంలో భాగంగా గత ఐదేళ్లుగా రాష్ట్రంలో పచ్చదనం పెంపుకు తీసుకుంటున్న చర్యలు, అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్దిని మంత్రులకు, ఇతర రాష్ట్రాలకు చెందిన సహచర ఎం.పీలకు మన ఎంపీలు వివరించారు. హరితహారం కార్యక్రమం తనకు తెలుసునని, తెలంగాణ పర్యటనలో తాను స్వయంగా పాల్గొని మొక్కలు నాటిన విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ గుర్తు చేసుకున్నారు. ఇక పచ్చదనం పెంపులో భాగంగా తాను స్వయంగా హైదరాబాద్ శివారులో కీసర రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకున్నట్లు, ఎంపీ లాడ్స్ నిధులతో అక్కడ ఎకో టూరిజంను కూడా అభివృద్ది చేయనున్న విషయాన్ని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కేంద్రమంత్రులకు, ఎం.పీలకు వివరించారు. మంచి ప్రయత్నమంటూ వారందరూ సంతోష్ ను అభినందించారు.