వినోద్ పై దాడి చేసిన వారికి బిగిస్తున్న ఉచ్చు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వినోద్ పై దాడి చేసిన వారికి బిగిస్తున్న ఉచ్చు

హైద్రాబాద్, జూలై 22 (way2newstv.com)
జబర్దస్త్‌ నటుడు వినోద్‌పై దాడి చేసిన ఐదుగురు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్‌‌లతో పాపులర్ అయిన నటుడు వినోద్‌ అలియాస్ వినోదినిపై గత శనివారం (జులై 20) దాడి జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని కుత్బిగూడలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న వినోద్‌పై ఓ ఇల్లు కొనుగోలు అంశంలో ఆ ఇంటి యజమాని, అతడి కుమారులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వినోద్ ఆసుపత్రితో చికిత్స పొందుతున్నారు. 
వినోద్ పై దాడి చేసిన వారికి బిగిస్తున్న ఉచ్చు

తనపై ఇంటి ఓనర్ కుటుంబం హత్యాయత్నం చేసిందని కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో వినోద్ ఫిర్యాదు చేశారు. కులం పేరుతో దూషించారని ఆరోపించారు. వినోద్ ఫిర్యాదు మేరకు ఇసామియా బజార్‌లో నివసిస్తున్న బాలాజీ, ప్రమీల దంపతులతో పాటు వారి కుమారులు ఉదయ్‌ సాగర్‌, అతడి భార్య సంధ్య, అభిషేక్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ హబీబుల్లాఖాన్‌ తెలిపారు. వినోద్ తాను ఉంటున్న 70 గ‌జాల ఇంటిని కొనుగోలు చేసేందుకు యజమానితో 4 నెలల కిందట ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో య‌జ‌మానికి రూ.10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్లు ఆయన చెబుతున్నారు. అయితే.. అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఆ ఇంటిని అమ్మడానికి యజమాని కుటుంబం నిరాకరిస్తోందని.. ఈ విషయంపై నిలదీయడానికి వెళ్తే యజమాని కుటుంబం తనపై దాడి చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. యజమాని కుటుంబం దాడిలో వినోద్ త‌ల‌కు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యులు చికిత్స అందించారు. వినోద్ ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.