ఆటవీ అధికారులకు అడ్డుకున్ పోడు రైతులు


భద్రాద్రి కొత్తగూడెం జూలై 6, (way2newstv.com)
అటవీ భూములను చదును చేస్తున్న అటవీ అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. దాంతో ఆ ప్రాంతంలో  ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన న్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. 

ఆటవీ అధికారులకు అడ్డుకున్ పోడు రైతులు

జిల్లాలోని ఇల్లెందు మండలంలోని వీరాపురం, ఒంపుగూడెం, కోటగడ్డ పరిధిలోని అటవీ భూములను అటవీ  అధికారులు  చదును చేస్తున్నారు. వీరికి రక్షణగా పోలీసులు కుడా వచ్చారు. అయితే  అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి  పరిస్థితి తీవ్రంగా  మారింది. పోడు భూమిలో మొక్కలు వేసేందుకు అధికారులు ట్రాక్టర్లతో చదును చేయిస్తుండగా..పోడు రైతులు ట్రాక్టర్లను పోనివ్వకుండా అడ్డంగా పడుకున్నారు. దీంతో అధికారులు బలవంతంగా సుమారు 30 మంది రైతులను అరెస్టు చేసి ఇల్లెందు పోలీసుస్టేషన్కు తరలించారు. ఈ ఘటనలో  కొందరికి  స్వల్ప గాయాలయ్యాయి. 
Previous Post Next Post