ప్రతినెలా వ్యవసాయ మిషన్ సమావేశాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రతినెలా వ్యవసాయ మిషన్ సమావేశాలు

అమరావతి, జూలై 6, (way2newstv.com)
రూ.1700కోట్లతో పగటిపూట 9గంటల పాటు నిరంతరం విద్యుత్ అందించేలా 60 శాతం ఫీడర్ల ఆధునీకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శనివారం అగ్రికల్చర్ మిషన్ సభ్యులతో సీఎం జగన్ నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అధికారులు, రైతు సంఘం నేతలు పాల్గొన్నారు. 
ప్రతినెలా వ్యవసాయ మిషన్ సమావేశాలు

సీఎం మాట్లాడుతూ… రైతు సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. నీటి సంఘాల ఎన్నికలు కూడా నిర్వహిస్తామన్నారు. గతంలో నామినేట్ చేసిన పదవులు రద్దు చేస్తున్నామన్నారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయించామని సీఎం జగన్ అన్నారు. ఇక నుంచి ప్రతినెలా వ్యవసాయ మిషన్ సమావేశం,  3 వేల కోట్ల ధరల స్థిరీ కరణ నిధి వ్యవసాయ మిషన్ పరిధిలోనే ఇన్ ఫుట్ సబ్సిడీ, విత్తనాల లోటు లేకుండా ప్రణాళికలు చేపట్టాలని అయన సూచించారు.  పగటిపూట 9 గంటల పాటు నిరంతరయంగా విద్యుత్ అందించేలా 60 శాతం ఫీడర్ ల అధునీకరణ, ఇందుకు 1700 కోట్లు ఖర్చు చేస్తాం. గతంలో నామినేట్ చేసిన పదవులు రద్దు చేస్తారు. భూ రికార్డుల సవరణ కూడా చేపట్టాల్సి ఉంది. విత్తనాల కొరత, నాణ్యత విషయంలో ను ఓ లాబ్ ఏర్పాటు చేయించాలని ముఖ్యమంత్రి సూచించారు.