శ్రీకాకుళం, జూలై 18, (way2newstv.com)
కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన అందించేందుకు జిల్లాలోని ఉన్నత పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. తద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన బోధన అందించనున్నారు. సాధారణ విద్యార్థిలో ప్రతిభ వెలికితీసి మరింత సానపెట్టనున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది మరో 161 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. గతేడాది 230 పాఠశాలల్లో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో తరగతులను నిర్వహించారు.
సిక్కోలు స్కూల్స్ లో డిజిటల్ క్లాసులు
దీంతో ఇప్పటి వరకు 391 పాఠశాలల్లో డిజిటల్ బోధన నిర్వహిస్తున్నట్లయింది. మిగిలిన 92 పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి డిజిటల్ తరగతులు నిర్వహించే అవకాశాలున్నాయి. రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థ(ఎస్‌సిఇ ఆర్‌టి) యూస్కే సంస్థ సహకారంతో గణితం, ఆంగ్లం, సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం, సబ్జెక్టుల పాఠ్యాంశాలను డిజిటల్ పద్ధతిలో రూపొందించింది. ఈ పాఠ్యాంశాలను బోధన చేసేందుకు ప్రస్తుతం ఉన్న 7.0 వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం అందించిన పరిజ్ఞానంతోపాటు ఉపాధ్యాయులు ఇంటర్నెట్‌ను వినియోగించి యూట్యూబ్, ఇతర మాధ్యమాల సహకారంతో పాఠ్యాంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి విద్యార్థులకు బోధపడే రీతిలో బోధన సాగించేందుకు డిజిటల్ బోధన చేయడం వల్ల విద్యార్ధులందరూ పా ఠాలను సులభంగా అర్థం చేసుకుంటారని భా విస్తున్నారు.
Tags:
Andrapradeshnews