ఎమ్మెల్యేలకు లక్ష రూపాయిల గిఫ్ట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎమ్మెల్యేలకు లక్ష రూపాయిల గిఫ్ట్

విజయవాడ, జూలై 30, (way2newstv.com)
సెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా లక్ష రూపాయల గిఫ్ట్ కూపన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019, జులై 30వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదించింది జగన్ ప్రభుత్వం. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జులై 11వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొత్తం 14 రోజులు సమావేశాలు జరిగాయి. సెలవులతో కలిపి జులై 30 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి జులై 12న బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. 
ఎమ్మెల్యేలకు లక్ష రూపాయిల గిఫ్ట్

2019, జులై 29వ తేదీ సోమవారం 8 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అనంతరం సభను జులై 30వ తేదీతో ముగిసాయి. వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. సమావేశాల సందర్భంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు లక్ష రూపాయల గిఫ్ట్ కూపన్లు అందచేయనుంది ఏపీ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ ప్రవేశ పెట్టింది. అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నించింది. కొన్ని సందర్భాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారనే ఉద్దేశ్యంతో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెన్షన్ చేసిన సంగతి తెలిసిందే. ముగ్గురు సభ్యులను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసిన స్పీకర్..మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. వీరిని ఒకరోజు పాటు మాత్రమే సస్పెండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఆగస్టు 01వ తేదీ గురువారం సీఎం జగన్..కుటుంబసభ్యులతో జెరూసలెంకు వెళ్లనున్నారు.