తెలంగాణలో ఆరు విమానశ్రయాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణలో ఆరు విమానశ్రయాలు

హైద్రాబాద్, జూలై 26, (way2newstv.com)
 తెలంగాణలో కొత్తగా ఆరు విమానాశ్రయాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును 
ముమ్మరం చేసింది. ఈ దిశగా విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాల నివేదికను ఇచ్చే బాధ్యతను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి అప్పగించనున్నారు. విమానాశ్రయాల ఏర్పాటుకు కచ్చితమైన సాంకేతిక నివేదిక ఉండాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆరు విమానాశ్రయాల్లో సాంకేతికపరమైన అంశాలను అధ్యయనం చేసేందుకు దాదాపు రూ.4.5 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఈ కనె్సల్టెన్సీకి ఏఏఐ సహకారాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగా నిధులు కూడా సర్కారు ఇవ్వనుంది. 
తెలంగాణలో ఆరు విమానశ్రయాలు

ఈ నివేదిక వచ్చిన వెంటనే అత్యవసరంగా విమానాశ్రయాల ఏర్పాటును ప్రాధాన్యతల ప్రకారం వేగవంతం చేస్తారు. ఇప్పటికే మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముందుగా రూ.1.06 కోట్ల నిధులనున మంజూరు చేసింది. వరంగల్, పెద్దపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ఇక్కడ అవసరాన్ని బట్టి ఎయిర్‌స్ట్రిప్ట్స్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులను నిర్మిస్తారు. వరంగల్ వద్ద మమ్నూరు, పెద్దపల్లి వద్ద బసంతనగర్, నిజామాబాద్ వద్ద జక్రాన్‌ప8ల్లి, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం , మహబూబ్‌నగర్ జిల్లాలో అడ్డాకుల వద్ద విమానాశ్రయాలను నెలకొల్పాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కాగా వరంగల్ జిల్లా కేంద్రానికి సమీపంలో విమానాశ్రయం ఏర్పాటుకు సాంకేతికపరమైన అవరోధాలు ఉన్నాయి. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ జీఎంఆర్ విమానాశ్రయం నుంచి 150 కి.మీ పరిధిలో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు వీలు లేదు. దీనికి నిబంధనలు అంగీకరించవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఆ మేరకు జీఎంఆర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పెద్దపల్లి వద్ద బసంత్‌నగర్‌లో 750 ఎకరాల స్థలాన్ని విమానాశ్రయం ఏర్పాటు నిమిత్తం సేకరించనున్నారు. నిజామాబాద్ వద్ద 850 ఎకరాల స్థలం, ఆదిలాబాద్ వద్ద 350 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో ఎగుమతులు రూ.1.09 లక్షల కోట్లు దాటడంతో వరంగల్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో ఐటీ రంగం విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఐటీ రంగం హైదరాబాద్‌కే కాకుండా ప్రధానమైన పట్టణాల్లో కూడా విస్తరించేందుకు కేసీఆర్ సర్కార్ ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది. రామగుండం థర్మల్ విద్యుత్ కర్మాగారం, బొగ్గు గనుల కార్యకలాపాలు, కొత్తగూడెంలో సింగరేణి కాలరీస్‌ను దృష్టిలో పెట్టుకుని పెద్దపల్లి, కొత్తగూడెంలో ముందుగా విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి
బసంత్ నగర్ లో  చురుకుగా సర్వే పనులు
మాంచెస్టర్‌ ఆఫ్‌ ఇండియా’ గా పేరుగాంచిన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విమానశ్రయం నిర్మాణం జరిగితే పెద్దపల్లి జిల్లా మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారుల సహకారం తీసుకుని సర్వేప్రక్రియ వేగవంత చేయనుంది. దీంతో బసంత్‌నగర్‌లో నూతన విమానాశ్రయం ఏర్పాటు అంశానికి బలం చేకూరింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విమానాలు ఎగరనున్నాయి.బసంత్‌నగర్‌లో 1972లోనే విమానాశ్రయం ఏర్పాటు జరిగింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు వాయుదూత్‌ సర్వీసులు నడిచేవి. అయితే ఆరోజుల్లో ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ప్రభుత్వం కొంతకాలం తర్వాత విమాన సర్వీసులు నిలిపివేసింది.అనంతరం స్థానిక కేశోరాం సిమెంట్‌ కర్మాగారం యాజమాన్యం విమానశ్రయ స్థలాన్ని లీజుకు తీసుకుని దాదాపు 40 సంవత్సరాల పాటు సొంత అవసరాల కోసం వినియోగించుకుంటోంది. ఏటా కంపెనీ ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణ కోసం కంపెనీ అధినేత బసంత్‌కుమార్‌ బిర్లా ప్రత్యేక విమానంలో వచ్చినప్పుడు విమానశ్రయాన్ని వినియోగించేవారు. ఐదేళ్ల క్రితం కేశోరాం యాజమాన్యం విమానశ్రయ స్థలం లీజు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ప్రభుత్వం రన్‌వే స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. జిల్లా అధికారులు ఇచ్చిన సర్వేరిపోర్టు ఆధారంగా బసంత్‌నగర్‌కు వచ్చిన ఏవియేషన్‌ అధికారులు స్థానికంగా ఉన్నరన్‌వేతో పాటు ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు.అయితే ప్రతిపాదిత స్థలం చుట్టూ హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్లు ఉన్నాయనే కారణంతో అధికారులు విముఖత చూపారు. ప్రస్తుతం నిర్వహించిన సర్వేలో టవర్‌ లైన్లను తప్పించి 290 ఎకరాల స్థలాన్ని అధికారులు సేకరించారు.పారిశ్రామిక జిల్లాగా నూతనంగా ఏర్పాటైన పెద్దపల్లి జిల్లాలో విమానశ్రయం ఏర్పాటుతో సమీప ప్రాంతంలో రవాణాసౌకర్యం మరింత మెరుగపడనున్నది. జిల్లా పరిధిలో రామగుండం, ఎన్టీపీసీ, సింగరేణి, కేశోరాం మొదలగు పరిశ్రమలుండగా, ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎన్టీపీసీలో మరో రెండు నూతన విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం జరుగుతోంది. ఈ పరిశ్రమల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు కార్మికులు, ఉద్యోగులు, అధికారులుగా పనిచేస్తున్నారువీరంతా  సొంత అవసరాలతో పాటు వృత్తి, వ్యాపార కార్యాకలాపాల కోసం దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్తూ.. వస్తుంటారు. ప్రస్తుతం వీరు రైలు మార్గాల ద్వారా ప్రయాణం చేస్తున్నారు. లేదంటే హైదరాబాద్‌కు వెళ్లి విమానం ఎక్కాల్సి ఉంటుంది. తద్వారా ఖర్చుతో పాటు సమయాభావం అధికమవుతున్నది. స్థానికంగా విమానశ్రయం ఏర్పాటైతే అన్నివర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది..బసంత్‌నగర్‌లో విమానశ్రయం ఏర్పాటుతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల ప్రజలకు విమానయాన సౌకర్యం అందుబాటులోకి రానున్నది. బసంత్‌నగర్‌ పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉండగా కరీంనగర్, జగిత్యాల జిల్లా కేంద్రాలకు 45 కిలోమీటర్లు, మంచిర్యాల జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో ఆయా జిల్లాల పరిధిలోని ప్రాంత వాసులకు ఇంది ఎంతో అనుకూలంగా మారనుంది.