రెచ్చగొడుతన్న ...వైసీపీ కూల్ కూల్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రెచ్చగొడుతన్న ...వైసీపీ కూల్ కూల్

నెల్లూరు, జూలై 26, (way2newstv.com)
గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు చేసిన తప్పు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేయడం లేదా…? వ్యూహాత్మకంగానే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారా? తనకు వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి సేఫ్ గా ఉండేలా జగన్ చూసుకుంటున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు చివరి నిమిషంలో భారతీయ జనతా పార్టీతో విభేదాలు పెట్టుకుని రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోయారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోకుండా, అభివృద్ధి పనులు నిలిచిపోయి ప్రజలకు ఏం చెప్పుకోవాలో తెలియక కేంద్రంపైనే ఎక్కువగా ఘాటైన విమర్శలు తన ఎన్నికల ప్రచారంలో చేశారు.చంద్రబాబునాయుడుకు పెద్దగా ఉపయోగపడింది లేదు. 
రెచ్చగొడుతన్న ...వైసీపీ కూల్ కూల్

ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో పయనించాలన్నది కొందరి వాదన. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలని, రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవాలని కొందరు మేధావులు సయితం జగన్ కు సూచిస్తున్నారు. అయితే జగన్ మాత్రం జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. కేంద్రంతో ఎలాంటి వివాదాలు పెట్టుకోకుండా ముందుకు సాగాలని, బతిమాలైనా నిధులు తెచ్చుకోవాలని వై.ఎస్.జగన్ భావిస్తున్నారు.అందుకోసమే ప్రత్యేక హోదా కోసం తాను ఎన్నిసార్లయినా ప్రధానిని కలుస్తానని, బతిమాలతానని వైఎస్ జగన్ తొలినాళ్లలో చెప్పిన మాటను ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. కేంద్రంతో కయ్యం పెట్టుకుని సాధించేదేమీ లేదన్న నిర్ణయానికి వచ్చారు. ఇక భారతీయ జనతా పార్టీ జగన్ పై గేమ్ స్టార్ట్ చేసింది. రాష్ట్ర స్థాయి నేతల నుంచి జాతీయ స్థాయి నేతల వరకూ రాష్ట్రానికి వచ్చి జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.పురంద్రీశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, రామ్ మాధవ్ లాంటి నేతలు జగన్ పాలనపై విమర్శలు ప్రారంభించారు. అయితే వారి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ పార్టీ నేతలకు చెప్పినట్లు తెలిసింది. వారిపై తిరిగి విమర్శలు చేసినందున ఎలాంటి ప్రయోజనం లేదని, వారు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలను జగన్ పంపారు. వారి ట్రాప్ లో పడవద్దని, చంద్రబాబు అలా వారి ట్రాప్ లో పడే అధికారానికి దూరమయ్యారని జగన్ పార్టీ నేతలకు చెబుతున్నారు. సో… బీజేపీ నేతలు ఎంత తిట్టినా అది కంఠశోషగా మిగులుతుందే తప్ప వైసీపీ నుంచి మాత్రం రెస్పాన్స్ రాదట.