ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం

జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
 జగిత్యాల  జూలై 15 (way2newstv.com)
ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్మమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో పలువురు లబ్దిదారులకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈమేరకు జగిత్యాల పట్టణంలోని పలువురుకి శస్త్ర చికిత్సలు జరుగగా 63మంది లబ్ది దారులకు సీఎం సహాయనిధి నుంచి రూ 16,31,500 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు . 
ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం

ఆనంతరం ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం సీఎం కృషి చేస్తున్నారన్నారు. ఆరోగ్య శ్రీ ద్యారా చేసే శస్త్ర చికిత్సలు ప్రజలు సూచించారు. సీఎం సహాయ నిధి నుంచి నిధులు మంజూరు కు కృషి చేసినందుకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గట్టు సతీష్,అయిల్నేని వెంకటేశ్వర్ రావు,బోగ వెంకటేశ్వర్లు,అయిల్నేని సాగర్ రావు, సమీండ్ల శ్రీనివాస్, సంగెపు మహేష్,బండారు నరేందర్,చదువుల కొటేశ్వర్ రావు,తయ్యబ్ అలీ,అల్లే సాగర్, తదితరులు పాల్గొన్నారు.