హైదరాబద్ సెంట్రల్ యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ అప్పారావు
హైదరాబద్ జూలై 2 (way2newstv.com)
సూక్ష్మ జీవుల వినియోగం తో పంటల దిగుబడిని పెంచుకోవడమే కాకుండా వ్యవసాయ రంగం లో సరి కొత్త మార్పులను తీసుక రావచ్చునని హైదరాబద్ సెంట్రల్ యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ పోదిలే అప్పారావు అన్నారు.శ్రీ బయో ఈస్తటిక్స్ సంస్థ ఆద్వర్యం లో సూక్ష్మ జీవుల వినియోగం తో పంటల దిగుబడి పెంపు ఫై గచ్చి బౌలి లో జరిగిన సదస్సు లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. సూక్ష్మ జీవుల వినియోగం తో పంటలకు సంబంధించిన సమస్యలను అతి తక్కువ వ్యయం తో పరిస్కరించవచ్చునన్నారు.
సూక్ష్మ జీవుల వినియోగం తో అధిక పంటల దిగుబడి
మై అగ్రి బయోం పేరుతో ప్రారంబించిన కొత్త పరిజ్ఞనం తో రకరకాల సుక్ష్మజీవులసముదాయాలను వృద్ధి చేయవచ్చునన్నారు.ఏ పంటకు ఏ సముదాయం అవసరమో వాటికి అనుగుణంగా వాడుకోవచ్చునన్నారు. శ్రీ బయో ఈస్తటిక్స్ ఎండి డాక్టర్ కేఆర్ కే రెడ్డి మాట్లాడుతూ పురుగుల మందులు ,రసాయన ఎరువులు వాడకం పెరగటం మూలంగా నేలలో సూక్ష్మ జీవులు అంతరించి పోతున్నయన్నారు.తమ సంస్థ వచ్చిన తర్వాత నూతన పరిజ్ఞనం తో విత్తన శుద్ధి చేయడం, భూసారాన్ని పెంచడం సాద్యమవుతున్దన్నారు.ఈ సందర్బంగా ఆగ్రో బయోం బయోటిక్నలజి ప్లాట్ ఫాం కు సంబందించిన లోగో,వెబ్ సైట్ ను సెంట్రల్ యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ పోదేలే అప్పారావు ఆవిస్కరించారు.ఈ కార్యక్రమం లో యోగి వీమన యునివర్సిటీ పూర్వ విసి ఏఆర్ రెడ్డి, ప్రొఫెసర్ బహదూర్ తదితరులు పాల్గొన్నారు.