గిరిజన సంక్షేమ హస్టల్ లో రాత్రి బస చేసిన కలెక్టర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గిరిజన సంక్షేమ హస్టల్ లో రాత్రి బస చేసిన కలెక్టర్


కర్నూలు, జూలై 4,(way2newstv.com)
కర్నూలు జిల్లా  ఆళ్లగడ్డ ఎస్టి హాస్టల్లో గురువారం రాత్రి జిల్లా కలెక్టర్ వీర పాండియన్ నైట్ బస చేసారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హాస్టళ్లు పలు ప్రభుత్వ కార్యాలయాల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.  మరుగు దొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో హాస్టల్ వార్డెన్ ధామస్  పై ఆగ్రహం వ్యక్తం చేసారు.  పరిసరాలను పరిశుభ్రంగా చేసి నాకు వీడియోలను పంపించవలసిందిగా ఆదేశాలు జారీ జారీచేసారు. 

గిరిజన సంక్షేమ హస్టల్ లో రాత్రి బస చేసిన కలెక్టర్

శుక్రవారం ఉదయం హాస్టల్లో పిల్లలతో కలిసి కలెక్టర్ టిఫిన్ చేసారు. తరువాత అయన మాట్లాడుతూ కార్పొరేట్ స్కూల్ లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని అన్ఆరు. విధ్యార్దులకు  ఎటువంటి వసతుల లోటు లేకుండా చూస్తామని అన్నారు.  ముఖ్యమంత్రి  ఆదేశాలమేరకు ప్రతి ఐయేఎస్  అధికారి వారంలో ఒకరోజు ప్రభుత్వ హాస్టళ్లలో బసచేసి అక్కడ పరిస్థితులు, వసతులు ఎలావున్నాయో తెలుసుకోనున్నారని అయన అన్నారు.