విజయవాడ, ఆగస్టు 16, (way2newstv.com)
పీడీ ఖాతాలపై గొడవ నేపథ్యంలో సాధారణ బ్యారకు ఖాతాల్లో ఉన్న నగదు నిల్వలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఏయే బ్యాంకుల్లో, ఏయే విభాగాల్లో ఎన్ని నిధులున్నాయన్నది లెక్కలు తేల్చింది. మొత్తం 38 బ్యాంకుల్లో 12,500 కోట్ల రూపాయలు ఉన్నట్లు తేలింది. అవి కూడా ఏకంగా 33,486 ఖాతాలు ఉన్నట్లు వెల్లడయ్యింది. ఇరదులో సేవింగ్స్, కరెంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలు ఉన్నట్లు స్పష్టమయ్యింది. ఇన్ని ఖాతాలు ఎందుకన్న ప్రశ్న కూడా వ్యక్తమవుతోరది. ప్రభుత్వ రంగ సంస్థల ఖాతాల్లో కొన్ని నిధులు మురిగిపోతున్నట్లు కనిపిస్తోరది. రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్‌బ్యాంక్‌లో 12,585 ఖాతాల్లో సుమారు 4400 కోట్ల రూపాయలు, ఆంధ్రా బ్యారకులో 12,700 ఖాతాల్లో 3137 కోట్ల రూపా యల నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.
బ్యాంకు ఖాతాల్లో 12,500 కోట్లు
స్టేట్‌బ్యాంకుకు సంబంధిరచి సేవింగ్ ఖాతాల్లో రూ.3000 కోట్లు, కరెంట్ ఎక్కౌంట్‌లో రూ.1100 కోట్లు, ఫిక్స్‌డ్ ఖాతాల్లో 250 కోట్లు ఉన్నాయి. ఆంధ్రాబ్యాంకుకు సంబంధించి సేవింగ్స్ ఖాతాల్లో రూ.2115 కోట్లు, కరెంట్ ఎక్కౌంట్‌లో రూ.294 కోట్లు, ఫిక్స్‌డ్ ఖాతాల్లో రూ.728 కోట్లు ఉన్నట్లు తేలింది. మిగిలిన 36 బ్యారకుల్లో చిన్న చిన్న మొత్తాలున్నాయి.ఇలా ఉండగా ఈ మొత్తంలో కేంద్ర ప్రయోజిత పథకాలకు వచ్చిన నిధులుకూడా దాదాపు ఎనిమిది వేల బ్యాంకు ఖాతాల్లో కనిపిస్తున్నాయి. ఈ నిధుల్లో రూ.137 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా వేసేశారు. అయితే, దీనికి కారణాలు అధికారులు చెప్పలేకపోతున్నారు. దీనివల్ల కొన్ని కేంద్ర పథకాలు నత్తనడకన సాగుతున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఇక కరెంట్ ఖాతాల్లో రూ.274 కోట్లు, సేవింగ్స్ ఖాతాల్లో రూ.2780 కోట్లు ఉన్నాయి. ప్రభుత్వ నిధులకు సంబంధిరచి రూ.2526 కోట్లు, వివిధ సంస్థలకు సంబంధించిన రూ.2600 కోట్లు, దేనికైనా వాడుకునేందుకు అవకాశం ఉన్న నిధులు రూ.4250 కోట్లు బ్యాంకుల్లోనే ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా నిధులు భారీగానే బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. 63 సంస్థల్లో ఏకంగా రూ.5245 కోట్లు బ్యాంకుల్లో కనిపిస్తున్నాయి. వీటిల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా 1400 కోట్ల వరకు ఉండడం విశేషం. అంటే నిధులు దాదాపుగా కోల్డ్‌స్టోరేజీలోనే ఉరటున్నట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఎప్పుడో భోగాపురం ఇరటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కోసం ప్రభుత్వం విడుదల చేసిన 102 కోట్లు కరెంట్ ఖాతాలో ఉన్నాయి. కరెంట్ ఖాతా వల్ల వడ్డీ కూడా పెద్దగా వచ్చే అవకాశాలు లేనందువల్ల ఈ నిధులు నిరుపయోగంగా పడి ఉంటున్నట్లు తెలుస్తోరది. అలాగే సెర్ప్‌కు సంబంధించిన రూ.1140 కోట్లు బ్యాంకుల్లో ఉన్నాయి. ఇవి సేవింగ్స్, కరెంట్ ఖాతాల్లో ఉన్నాయి. ప్రధానంగా డ్వాక్రా రుణాలు, పింఛన్లను ఈ శాఖనుంచే ఇవ్వాల్సి ఉరటుంది. అరదుకే ఈ నిధుల్ని ఫిక్స్‌డ్ ఖాతాల్లో పెట్టలేదని అధికారులు అరటున్నారు. ఇక వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఖాతాల్లోనూ 186 కోట్లు బ్యాంకుల్లో ఉరడగా, అందులో 157 కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నట్లు గుర్తిరచారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించి ఎస్సీ సహకార ఆర్థిక సంస్థలో 30 కోట్లు, మార్కెటిరగ్ ఫెడరేషన్‌లో 119 కోట్లు, పర్యాటక అభివృద్ధి సంస్థలో 40 కోట్లు, ఖనిజాభివృద్ధి సంస్థలో 300 కోట్లు, వేర్‌హౌసిరగ్‌లో 124 కోట్లు, ఉద్యానవన యూనివర్శిటీలో 32 కోట్లు, వైద్య మౌలికాభివృద్ధి సంస్థలో 300 కోట్లు, కాపు సంక్షేమ కార్పొరేషన్‌లో 64 కోట్లు, లైవ్‌స్టాక్ అభివృద్ధి సంస్థలో 104 కోట్లు ఎఫ్‌డి ఖాతాల్లో ఉన్నాయి
Tags:
Andrapradeshnews