13 నుంచి బీఆర్కే భవన్ లోనే సచివాలయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

13 నుంచి బీఆర్కే భవన్ లోనే సచివాలయం

హైద్రాబాద్, ఆగస్టు 8 (way2newstv.com):
తెలంగాణ సచివాలయం 13 నుంచి బీఆర్కే భవన్ నుంచే కార్యాకలాపాలను కొనసాగించనుంది. కొత్త సచివాలయం నిర్మించాలన్న ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం ఇక్కడి కార్యాలయాలను బూర్గుల రామకృష్ణారావు భవన్‌ (బీఆర్కే భవన్‌)కు తరలిస్తున్నారు. ఏ శాఖను ఏ అంతస్తులో ఏర్పాటు చేయాలన్న విషయమై స్పష్టతనిచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ (జీఏడీ) రూపొందించిన ప్రణాళికను అన్ని శాఖలకు పంపింది. 
13 నుంచి బీఆర్కే భవన్ లోనే సచివాలయం

తొమ్మిది అంతస్తుల్లో బీ, సీ, డీ బ్లాకులుగా ఉన్న భవనంలో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల కార్యాలయాలు, ఆ శాఖల సర్క్యులేటింగ్‌ సెక్షన్లు, డిప్యూటీ సెక్రటరీల చాంబర్లు ఏర్పాటు కానున్నాయి. తొమ్మిదో అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం కొలువు తీరనుంది. ఎనిమిదో అంతస్తులో ఆర్థిక, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి కార్యాలయం, ఏడో అంతస్తులో హోం, విద్యుత్తు శాఖల ముఖ్య కార్యదర్శుల కార్యాలయాలు ఏర్పాటవుతాయి. మొదటి అంతస్తులో మంత్రుల చాంబర్లు, పేషీలు ఉంటాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో బ్యాంకులు, పోస్ట్‌ ఆఫీస్‌, రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌, బీఎ్‌సఎన్‌ఎల్‌, టీఎ్‌సటీఎస్‌ సీఈఓ కార్యాలయం ఏర్పాటు కానున్నాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌నే పార్కింగ్‌ కోసం వినియోగించనున్నట్లు జీఏడీ స్పష్టం చేసింది