కాపులకు 5శాతం కోటాను కేంద్రం ఆమోదించాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాపులకు 5శాతం కోటాను కేంద్రం ఆమోదించాలి

ప్రధాని మోదీకి కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ
అమరావతి ఆగష్టు 13 (way2newstv.com
భారత ప్రధాని నరేంద్ర మోదీకి మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఇప్పటికే పలుమార్లు గత, ప్రస్తుత ప్రభుత్వాలకు కాపు రిజర్వేషన్‌ల గురించి లేఖలు రాసిన ముద్రగడ ఈసారి ఏకంగా మోదీకే లేఖ రాశారు. 2017లో తెదేపా ప్రభుత్వం ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లలో కాపులకు 5శాతం కోటా కేటాయించిందని, దీనిని కేంద్రం ఆమోదించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. 
కాపులకు 5శాతం కోటాను కేంద్రం ఆమోదించాలి

బిల్లు కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్‌లో ఉందని లేఖలో ముద్రగడ గుర్తు చేశారు. రిజర్వేషన్లు కల్పిస్తామని హామీలు ఇస్తూ ప్రభుత్వాలు తమ జాతిని మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసమే కాపులను వాడుకుంటున్నారని ప్రధానికి రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.రాజకీయపక్షాలు తమ ఓట్లు పొంది రిజర్వేషన్ విషయంలో మోసం చేశాయని.. కాపు రిజర్వేషన్‌ అమలుకు సహకరించాలని మోదీని ముద్రగడ కోరారు.