శ్రీకాకుళం, ఆగష్టు 13 (way2newstv.com)
ఆమదాలవలస పురపాలక సంఘం ప్రాంగణంలో వార్డ్ వాలంటీర్ల ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం స్థానిక శాసన సభ్యుని హోదాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, పొడుగు శ్రీనివాసరావు, అల్లంసేట్టి ఉమా మహేశ్వర రావు, బొడ్డేపల్లి రమేష్, మోహనరావు, వెంకటేశ్వరరావు, అజంత కుమారి, దుంపల శ్యామలరావు మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్ రమణ, మునిసిపల్ కమీషనర్, మరియు వివిధ శాఖల అధికారులు మరియు వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.తమ్మినేని మాట్లడుతూ వాలంటేరు, గ్రామ సచివాలయం ప్రతి గడపకు పరిపాలన చేరవేసే వ్యవస్థ. క్రింది నుండి పై స్థాయి వరకు జవాబుదారీ వ్యవస్థ. ఇది పారదర్శకత కలిగినది. ఈ వ్యవస్థలో జవం, జీవం మీరేనని అన్నారు. శాసన సభలో చారిత్రాత్మక చట్టాలను చేసాం.
నిజాయతి, నిర్భీతితో సేవలు అందించండి
మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. వాలంటీర్ల వ్యవస్థ ఏ లక్ష్యంతో స్థాపించారో దానిపై పూర్తి అవగాహన పొందాలి. కొత్త వ్యవస్థ. అనితర సాధ్యం. వాలంటీర్లకు ఇది గొప్ప అవకాశం ఇది. భవిష్యత్ లో రెగ్యులర్ ఉద్యోగులుగా మారే అవకాశం వుంది. సేవలను నిజాయితీగా, నిర్భీతిగా అందించండి. ఎటువంటి ఆరోపణలకు తావులేకుండా పనిచేయాలి. అనవసరపు ఆరోపణలకు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఇళ్లకు వెళ్ళేటప్పుడు రేషన్, పింఛను, మరుగుదొడ్లు తదితర అన్ని అంశాలను పరిశీలించాలి. వాలంటీర్లు అందించిన నివేదికలు తుది నివేదికలు అవుతాయి. వ్యవస్థను విజయవంతం చేయాలి. ప్రతీ గ్రామ సచివాలయాలను సందర్శిస్తామని అన్నారు. వ్యవస్థలో బలాలు, బలహీనతలు గమనించి లోటుపాట్లను పరిష్కారం చేస్తాం. రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు పురపాలక సంఘం ప్రత్యేక అధికారి ఎం.వి.రమణ మాట్లాడుతూ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ సేవలు ఇంటి వద్దకే అందుబాటులోకి వస్తుంది. 236 మంది వాలంటీర్ల పోస్టులలో 213 పురపాలక సంఘంలో నియామకం జరిగింది. ఖాళీగా ఉన్న వాటిని త్వరలో భర్తీ చేస్తామని అన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి రేషన్ ఇంటివద్దకే వస్తోంది. జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం. పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో ఎటువంటి పొరపాట్లు చేయరాదు. 8వ వార్డ్ వాలంటీరు అనూష,16వ వార్డ్ వాలంటీరుగా ఎంపికైన కళ్యాణి, మాట్లాడుతూ మంచి సమాజం నిర్మించుటకు వాలంటీర్ల వ్యవస్థ 119 రకాల సేవలను 50 ఇళ్లకు అందించాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రతీ కుటుంబానికి అందించాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల కార్యక్రమం పట్ల స్పష్టమైన అవగాహన కలిగించారని అన్నారు.
Tags:
Andrapradeshnews