అక్టోబరు 8కు సైరా...? - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అక్టోబరు 8కు సైరా...?

హైద్రాబాద్, ఆగస్టు 30, (way2newstv.com)
తంత్ర్య సమరయోథుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘సైరా’. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. హీరో రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ,హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. 
అక్టోబరు 8కు సైరా...?

ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని ముందుగా నిర్ణయించారు. అయితే ఇదే తేదీన హృతికి, టైగర్ ష్రాఫ్ నటించిన బాలీవుడ్ సినిమా ‘వార్’ భారీ స్థాయిలో విడుదలతోంది. దీంతో బాలీవుడ్ లో ‘సైరా’కు థియేటర్స్ దొరకలేదట. ఈ క్రమంలో వారం రోజుల పాటు ‘సైరా’ సినిమా విడుదలను వాయిదా వేయాలని బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత రామ్ చరణ్ ను కోరారట. దసరా సెలవులు సైతం కలిసొస్తాయని, అందుకే అక్టోబర్ 8న ‘సైరా’ను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ‘సైరా’ విడుదల వాయిదాపై నిర్మాత రామ్ చరణ్ తేజ్ మాత్రం స్పష్టత ఇవ్వలేదు.