వైసీపీలో ఫైర్ బ్రాండ్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైసీపీలో ఫైర్ బ్రాండ్స్

విజయవాడ, ఆగస్టు 30, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీలో గట్గిగా వాదంచే గొంతుకలున్నాయి. యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమ,అయ్యన్న పాత్రుడు వంటి నేతలు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చంద్రబాబు సంగతి సరేసరి. రోజుకో మీడియా సమేశమో, టెలికాన్ఫరెన్స్ లేదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విపక్షానికి ధీటుగా ఎదుర్కొనేలా కౌంటర్ ఇవ్వలేకపోతుంది వైసీపీ. ఇందుకోసం తిరిగి ఫైర్ బ్రాండ్ లను రెడీ చేయాలని జగన్ నిర్ణయించినట్లు తెలిసింది.ప్రభుత్వం కీలకమైన అమరావతి, పోలవరంపై తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లోకి ఒకవైపు మాత్రమే వెళుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి వైెస్ జగన్ భావిస్తున్నారు. 
వైసీపీలో ఫైర్ బ్రాండ్స్

పోలవరం ప్రాజెక్టు పనులను నవంబరు 1 నుంచి ప్రారంభిస్తామని సంబందిత మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పదే పదే చెబుతున్నా అది జనంలోకి వెళ్లలేదు. పోలవరం పనులను రీటెండర్లకు పిలిచినా ప్రభుత్వానికి వేల కోట్ల ధనం ఆదాఅవుతుందన్న విషయమూ హైలెట్ కావడం లేదు. కేవలం పోలవరం ఆగిపోయిందన్నది మాత్రమే జనంలో ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ఇందులో వైసీపీ విఫలమయింది.ఇక రాజధాని అమరావతి విషయంలోనూ అంతే. రాజధానిని మారుస్తామని వైసీపీ ఎక్కడా చెప్పలేదు. వరదలు వస్తే మునిగిపోతుందని, నిర్మాణ వ్యయం ఎక్కువని మాత్రమే చెప్పారంటున్నారు. కానీ ఇప్పటికీ రాజధాని అమరావతిని తరలిస్తున్నారంటూ టీడీపీ పెద్దయెత్తున ప్రచారం చేస్తుంది. ఇక బీజేపీ, టీడీపీలు కలసి రాజధాని తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. మరి రాజధానిలో ఎవరెవరికి భూములున్నాయన్న విషయాన్ని బొత్స సత్యనారాయణ స్పష్టంగా చెప్పారు. రాజధాని అమరావతి ఒక వర్గానికే పరిమితమయిందన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైసీపీ భావిస్తుంది.దీంతో వైసీపీ ఫైర్ బ్రాండ్లగా ముద్రపడిన కొందరు నేతలు మూగనోము పట్టారు. ముఖ్యంగా పార్థసారధి, అంబటి రాంబాబు, కొడాలి నాని, ఆర్కే రోజా, భూమన కరుణాకరరెడ్డి, ధర్మానప్రసాదరావు లాంటి నేతలు రాజధాని, పోలవరం విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలపై పెద్దగా స్పందించడం లేదు. అంబటి రాంబాబుకేవలం కోడెల కేసులపైనే స్పందిస్తున్నారు. దీంతో వారిని తిరిగి యాక్టివ్ చేయాలని జగన్ భావిస్తున్నారు. ముఖ్యనేతలతో జగన్ స్వయంగా సమావేశమై దీనిపై చర్చించే అవకాశముందంటున్నారు. విపక్షం చేసే విమర్శలకు దీటుగా సమాధానం చెప్పడమే కాకుండా, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రచారానికి కూడా వీరిని వినియోగించుకోవాలని వైసీపీ చూస్తుంది.