మూతపడుతున్న అన్న క్యాంటిన్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మూతపడుతున్న అన్న క్యాంటిన్లు

అనంతపురం, ఆగస్టు 1, (way2newstv.com)
 గత ప్రభుత్వ పథకాలను పక్కనపెట్టే పనిలో ఉంది. ఏదొకసాకుపెట్టి ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చేపనిలో ఉన్నారు. తాజాగా గత ప్రభుత్వం కేవలం ఐదు రూపాయలకే భోజనం పెట్టే అన్నాక్యాంటీన్లు తాత్కాలికంగా మూసేశారు. ఇవికాకుండా కొత్త ప్రాంతాల్లో క్యాంటీన్లు ఏర్పాటుచేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రంగులు వేస్తున్నామని చెప్పి మూడ్రోజుల నుంచి జిల్లాలో అన్నా క్యాంటీన్లు మూసేశారు. ఇవి మళ్లీ ప్రారంభిస్తారా లేదా అనుమానమే. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనానికి మంగళం పాడింది. ప్రభుత్వం ఇప్పుడు పేదలకు పెట్టే అన్నం విషయం లోనూ ఇలానే వ్యవహరిస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 
మూతపడుతున్న అన్న క్యాంటిన్లు

గత ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చేందుకు కేవలం ఐదురూపాయలకే భోజనం పెట్టేందుకు అన్నా క్యాంటీన్లు పేరుతో ప్రారంభించారు. చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల సమయంలో తమిళనాడు అమ్మ క్యాంటీన్లు తరహాలో ఇక్కడ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లు పట్టించుకోని చంద్రబాబు ఎన్నికలకు ఏడాది ఉందనగా రాష్ట్రవ్యాపితంగా క్యాంటీన్లు ఏర్పాటుచేశారు. జిల్లాలో 12 అన్నాక్యాంటీన్లు ఏర్పాటుచేశారు. నెల్లూరు నగరంలోనే ఎనిమిది చోట్ల అప్పటి మంత్రి పి.నారాయణ ఏర్పాటుచేశారు. ఎన్‌టిఆర్‌ బొమ్మపెట్టి పసుపు రంగుతో క్యాంటీన్లు ప్రారంభించారు. ఉదయం మూడు రూపాయలకు టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి ఐదు రూపాయలకే భోజనం ఏర్పాటుచేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, పట్టణంలో చిన్న చిన్న పనులు చేసుకొని హోటళ్లకు భారీగా డబ్బు ఖర్చుపెట్టలేనివారు క్యూ లైన్లు నిలబడి భోజనం చేసేవారు. అక్షయపాత్రకు ఈ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. నెల్లూరులో రామలింగాపురం, కూరగాయాలమార్కెట్‌, చేపల మార్కెట్‌, రామచంద్రారెడ్డి ఆసుపత్రి, పాత మున్సిపల్‌ ఆఫీసు తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుంచి అన్నా క్యాంటీన్లు ఉంటాయా ? ఉండవా? అనే అనుమానాలున్నాయి. తొలుత ఎన్‌టిఆర్‌ బొమ్మను తొలగించారు. అటు తర్వాత ఇప్పుడు రంగు మార్చే పనిలో ఉన్నారు. భవిష్యత్తులో ఈ క్యాంటీన్లు ఉంటాయా లేదా అనుమానమే ఇదే విషయంపై మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం అనవసరమైన చోట్ల క్యాంటీన్లు ఏర్పాటుచేసిందని, అందుకే తొలగించి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. అక్షయపాత్రే నిర్వహిస్తుందని తెలిపారు. ఈ ప్రాంతాల్లో పెట్టడం వల్ల ప్రయాణికులు దిగొచ్చి ఐదు రూపాయలకే భోజనం చేస్తారా అనే విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. ఇప్పటి వరకు టిడిపికి సంబంధించినవారే అన్నా క్యాంటీన్లులో భోజనాలు చేశారా ? వారికి అనుకూలమైన ప్రాంతాలంటే ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గత ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ఉండేది. ప్రభుత్వ స్థలాల్లో క్యాంటీన్లు పెట్టింది. ఇప్పుడు దీనిపై వివాదం సృష్టంచి తాత్కాలికంగా అన్నానికి కన్నంపెట్టారు.పేదల భోజనం విషయంలోనూ రాజకీయాలు చేయడమేమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి