యోగాతో సంపూర్ణ ఆరోగ్యం..! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం..!

చెట్లు పెంచండి.. ఆరోగ్యంగా జీవించండి.!
- గ్రామాభివృద్ధికి నేను సిద్ధంగా ఉన్నాను 
- ప్రతి ఇంటి ముందు వేప మొక్కలు నాటి వాటి సంరక్షణకు మీరు సిద్ధమవ్వాలొ
 కిష్టసాగర్, పొన్నాల, భట్టిరామన్న పల్లి గ్రామస్తులకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి హరీశ్ 
సిద్ధిపేట, ఆగస్టు 26(way2newstv.com)
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.! చెట్లను పెంచితే వచ్చే గాలితో ఆరోగ్యంగా జీవించవచ్చు.! మీ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానని., ప్రతి ఇంటి ముందు వేప మొక్కలు నాటి వాటిని సంరక్షించడానికి సిద్ధం కావాలని మాజీ మంత్రి హరీశ్ రావు గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట అర్బన్ మండలంలోని కిష్టసాగర్, పొన్నాల, భట్టి రామన్న పల్లి గ్రామాలలో ఆదివారం సాయంత్రం రూ.50లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు కిష్ట సాగర్ లో మహిళా మండలి భవన ప్రారంభం, పొన్నాలలో మున్నూరు కాపు సంఘ భవనం, గౌడ సంఘ భవనం, భట్టి రామన్న పల్లిలో మహిళా మండలి భవనాల అభివృద్ధి పనులకు జెడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేశారు. 
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం..!

ఈ సందర్భంగా కిష్టసాగర్ లో హరీశ్ రావు మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతి ఇంటి ముందు వేప చెట్టు నాటాలని, మీకు అందజేస్తున్నామని, ఇందుకు గ్రామ మహిళలు మొక్కలను నాటడానికి ముందుకు రావాలని కోరారు. గ్రామాభివృద్ధికి తానెప్పుడు సిద్ధంగా ఉంటానంటూ, కానీ అభివృద్ధికి ప్రతిఫలంగా గ్రామ మహిళలు. యువకులు మొక్కలను నాటి వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని  కోరారు. కిష్ట సాగర్ గ్రామంలో మినీ ఫంక్షన్ హాల్  నిర్మాణం కోసం రూ.25 లక్షలు, గ్రామ యువతకు రూ.5లక్షలతో జిమ్, రూ.5లక్షల రూపాయలు పెర్క భవనం ప్రహారి గోడకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతీ గ్రామంలో మహిళలు యోగ ఆసనాలు చేయాలని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తూ.. ప్రత్యేకించి యోగ టీచర్ ను ఏర్పాటు చేస్తానని తెలిపారు. మీ ప్రతి ఇంటి పరిసర ప్రాంతాలలో పూలమొక్కలు చల్లని గాలిని ఇచ్చే మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు. ఈ మేరకు ఆయా గ్రామాలలో గ్రామస్తులు మంగళహారతులు, కుంకుమ తిలకం దిద్ది హరీశ్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సవిత ప్రవీణ్ రెడ్డి, జెడ్పిటిసి ప్రవళిక, పొన్నాల సర్పంచ్ రేణుక శ్రీనివాస్, కిష్ట సాగర్ సర్పంచ్ రాజయ్య, ఎంపీడీఓ సమ్మిరెడ్డి, మండల గ్రామస్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.