అధికారం ఇస్తే ప్రజాసేవ ఏంటో చూపిస్తాం : టీజీ
ఎమ్మిగనూరు ఆగస్టు 26 (way2newstv.com)
పట్టణంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని గురించి జగన్ రాష్ట్ర బీజేపీ నాయకులతో ఏమి మాట్లాడలేదని పేర్కొన్నారు. జగన్ ఢిల్లీ నాయకులతో మాట్లాడి నాలుగు రాజధానిలు గురించి చర్చించారని తెలుసుకుని చెప్పానని ఆయన పేర్కొన్నారు. రాజధాని గురించి మాకు సంబంధం లేదు అన్న రఘురాం మాటలు మేము ఏకీభవిస్తామని అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో జెండా ఎగిరేస్తాం
రాష్ట్రంలో గుండాలు రాజకీయ నాయకులు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందదని ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ రద్దు చేసి నాలుగు రాష్ట్ర ప్రణాళికలు బోర్డులను జగన్ తయారు చేస్తున్నారని ఆయన అన్నారు. అంచేత నాలుగు రాజధానులు చేస్తున్నారని తాను అనుకుంటున్నట్లు టీజీ పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రల్లో బీజేపీ జెండా కచ్చితంగా ఎగరవేస్తాం అని ఆయన అన్నారు. కేంద్రం పథకాలు ప్రజలకు ఎన్నో రాష్ట్ర ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నా మేము అధికారంలో లేక పోవడంతో ప్రజలకు అందించలేక పోతున్నాంమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం గ్లోబల్ టెండరింగ్ దాన్ని రిటెండరింగ్ చేయడానికి పోతే కంపెనీ వాళ్ళు అంతర్జాతీయ న్యాయస్థానంకు వెళ్తారని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడ లేని విదంగా మన రాష్ట్రంలోనే ఎక్కువ డిప్యూటీ సీఎం లు చేసిన ఘనత జగన్ కే సాధ్యం అయ్యిందని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మిగనూరు బిజెపి ఇంచార్జ్ మురహరిరెడ్డి తదితరులు వున్నారు.