దొరల కోసమే రెవెన్యూ కొత్త చట్టం

టీపీసీసీ రాష్ట్ర సంయుక్త  కార్యదర్శి 
దేవులపల్లి యాదగిరి
నంగునూరు, ఆగస్టు 19 (way2newstv.com)
తెలంగాణ లోని లక్షల ఎకరాలు హస్తగతం చేసుకున్న వెలమ దొరల భూములు కాపాడడం కోసమే కొత్త రెవెన్యూ చట్టం తప్ప పేద  ప్రజల కోసం కాదని టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి స్పష్టం చేశారు.  సోమవారం నంగునూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన  విలేకర్ల సమావేశంలో  మాట్లాడారు కెసిఆర్  కొత్త చట్టం ఎందుకు చేస్తున్నారో,  ఎవరు చేయమన్నారో  ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాత రెవెన్యూ చట్టం ద్వారా  ఏమినష్టం జరిగిందో వివరిచకుండా కెసిఆర్ ఇష్టానుసారంగా చేస్తానంటే చూస్తు ఊరుకోమని  తెలియజేశారు. 
దొరల కోసమే రెవెన్యూ కొత్త చట్టం 

కొన్ని ఏండ్ల తరబడి సవ్యంగా ఉన్న  రికార్డులను తప్పుబట్టి తనకున్న కులపిచ్చితో కొంతమంది వెలమ రెడ్డి భూస్వామి దొరల భూములు కోసం తీసుకొచ్చిన భూప్రక్షాలన ధరణి వెబ్ సైట్ తో తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని, ప్రజలు అందులోని  మోసాన్ని తెలుసుకునే లోపే రెవెన్యూ శాఖలో మొత్తం అవినీతి అయ్యింది అందుకోసమే అ శాఖను ఎత్తేసి   మొత్తమే లేకుండా చేసే కుట్రల్లో భాగమే  కొత్త రెవెన్యూ చట్టం దాని పేరే రెవెన్యూ శాఖను పంచాయితీ శాఖలో విలీనం చేయడమేనని  పేర్కొన్నారు. రెవెన్యూ శాఖను మొత్తమే ఎత్తేస్తూ మరోపక్క రెవెన్యూ కొత్తచట్టామంటూ మరో కొత్త నాటకమాడుతున్నడని మండిపడ్డారు. నక్సలైట్ల భయానికి తెలంగాణ మొత్తం వెలమదొరలు కొంతమంది రెడ్డి భూస్వాములు కొన్ని లక్షల ఎకరాలను గ్రామాలల్లో వదిలి వెళ్ళితే  అట్టి భూముల్లో పేద యస్సీ ,ఎస్టీ ,బీసీ  అణగారిన  ప్రజలు కబ్జా ఖాస్తు చేసుకుంటూ  చేసుకుంటున్న భూములను తిరిగి వారికే  కట్టబెట్టానికే  చేస్తున్నదాంట్లో  భాగమే రైతు బందు పథకం వారిపేర్లున్న  రికార్డులను మాయం చేయడానికి తీసుకొచ్చేదే  కొత్తరెవెన్యూ  చట్టం అని తెలియజేశారు. ఇది కేవళం కొన్ని లక్షల ఎకరాల  భూములను వెలమదొరలకు  కట్టబెట్టడానికేనని పేర్కొన్నారు .ఈ కార్యక్రమములో గడ్డం కర్ణాకర్,
 కర్ణాకర్ రెడ్డి ,భేగ్ యాదవ్ ,మల్లయ్యలు  పాల్గొన్నారు.

Previous Post Next Post