వాసిరెడ్డికి కీలక పదవి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వాసిరెడ్డికి కీలక పదవి

విజయవాడ, ఆగస్టు 8 (way2newstv.com):
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైసీపీ నేత వాసిరెడ్డి పద్మకు కీలక పదవి అప్పగించారు. ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఆమె మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండు రోజుల క్రితమే మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా ఉన్న నన్నపనేని రాజకుమారి తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే వాసిరెడ్డి పద్మను ఆ పదవిలో నియమించారు. 
వాసిరెడ్డికి కీలక పదవి

వాసిరెడ్డి పద్మ గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. 2011లో ఆమె జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. అధికార ప్రతినిధిగా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతూ పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించారు. సార్వత్రిక వైసీపీ అధికారంలోకి రావడంతో.. ఆమె ఎమ్మెల్సీ కానీ నామినేటెడ్ పదవి కాని దక్కుతుందని భావించారు. వాసిరెడ్డి పద్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెలలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో పద్మ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఆమెకు ఎమ్మెల్సీగా జగన్ అవకాశం కల్పిస్తారని అంతా భావించారు. కానీ.. ఆమెను మహిళా కమిషన్ ఛైర్‌ పర్సన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.