పోలవరం పనులు ఆగిపోయాయి


దేవినేని ఉమ
విజయవాడ, ఆగస్టు 2, (way2newstv.com)
పోలవరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. 25.7మీటర్లు స్పిల్ వే దాటి  నీరు సముద్రంలోకి వెళ్లింది. దశాబ్దాల కాలం నాటి కల ను చంద్రబాబు నిజం చేసి చూపారని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. శుక్రవారం అయన టిడిపి కార్యాలయం లో పోలవరం వద్ద తాజా పరిస్థితి ని వివరిస్తూ వీడియో ను ప్రదర్శించారు. తరువాత అయన మాట్లాడుతూ చంద్రబాబు దూరదృష్టి, అధికారుల కష్టం తో ఐదేళ్లలో పూర్తి చేశాం. 
పోలవరం పనులు ఆగిపోయాయి

ఇంకా 150 అడుగుల ఎత్తులో  మట్టి కట్ట పని ఉంది. మొత్తం మీద రెండువేల కోట్ల రూపాయల పని మాత్రమే మిగిలింది. సిఎం జగన్ పోలవరం పనుల్లో ఆదా చేస్తానని మొన్న చెప్పారు. చర్చ పెడతామని చెప్పి.. కనీసం ఆ ఊసే లేకుండా చేశారని విమర్శించారు. కమిటీ రిపోర్ట్ బయట పెట్టకుండా పనుల కాంట్రాక్టు ను క్యాన్సిల్ చేశారు. కేవలం మీ కన్వియన్స్ కోసం అకారణంగా పనులు నిలిపివేశారు. 1953 నుంచి  34సంవత్సరాల అధిక ఫ్లడ్ లెక్కలను తీసుకున్నామని అన్నారు. ఈ యేడాది కూడా 15వేల క్యూసెక్కుల నీరు వస్తుందని ఉమా అన్నారు.
Previous Post Next Post