శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

తిరుమల ఆగస్టు 2, (way2newstv.com)
నవంబరు మాసానికి సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తితిదే విడుదల చేసింది. మొత్తం 69,254 టికెట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.టికెట్లను  వెబ్సైట్ ద్వారా ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 10,904 సేవా టికెట్లను విడుదల చేసింది. 
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

సుప్రభాతం 7549, తోమాల 120, అర్చన 120, అష్టదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం కోసం 2875 టికెట్లను విడుదల చేసింది. కరెంటు బుకింగ్ కింద 58,350 ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది. దీనిలో విశేష పూజ 1,500, కల్యాణోత్సవం 13,300, ఊంజల్సేవ 4,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 14,850, సహస్రదీపాలంకరణ కోసం 16,800 టికెట్లు విడుదల చేసింది. మరోవైపు జులైలో శ్రీవారికి రూ.106.28 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని, ఇటీవలి కాలంలో ఇది రికార్డు అని తితిదే ఓ ప్రకటనలో వెల్లడించింది.