గణేష్ ఉత్సవాలకు అంతా సిద్ధం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గణేష్ ఉత్సవాలకు అంతా సిద్ధం

హైద్రాబాద్, ఆగస్టు 26  (way2newstv.com
ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య రంగులద్దుకుని ముస్తాబు అవుతున్నడు. 61 అడుగుల భారీ వినాయకుడిని 12 తలలు, 12 సర్పాల బొమ్మలతో తీర్చిదిద్దుతున్నారు. పండక్కి నాలుగు రోజుల ముందే భక్తులకు దర్శనం కలిగేలా ఉత్సవ సమితి ఏర్పాట్లు చేస్తోంది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్, పోలీస్ శాఖ, ఆర్ అండ్ బీ, జీహెచ్‌ఎంసీ, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. 65వ సంవత్సరం బ్రహ్మాండంగా జరుగుతున్న గణేష్ ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల, నుండి కూడా భక్తులు రానుండడంతో అన్ని శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 
గణేష్ ఉత్సవాలకు అంతా సిద్ధం

అన్ని విధాలా అన్ని ఏర్పాట్లు చేస్తూ.. కొన్ని ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నారు. అలాగే ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు భారీగా నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖ లైట్స్, ఇతర సదుపాయాలు చేస్తున్నారని.. వినాయక మఠం చుట్టూ అద్భుతమైన బారికేడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ అధికారుల ఆధ్వర్యంలో లోతైన ప్రదేశంలో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చేయనున్నారు. ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తుంది వినాయక నిమజ్జనంను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించనున్నారు. విద్యుత్ ఇబ్బందులు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం మీకు అన్ని విధాలా అండగా ఉంటుంది. 
సీఎం కేసీఆర్ ఎప్పుడు చెబుతున్నారు అన్ని మతాల పండుగలు అద్భుతంగా జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. 
బైట్‌.. తలసాని శ్రీనివాస్ యాదవ్వినాయక నిమజ్జనం రోజు ప్రజలు సహకరించాలని మేయర్ బొంతు రామ్మోహన్ కోరారు. 
ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని 
లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారన్నారు.
 పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో భద్రత కల్పిస్తామని తెలిపారు
. హుస్సేన్ సాగర్ లోతైన  ప్రాంతంలో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చేస్తాం
. అందరూ భక్తులకు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. 
నిమజ్జనం కోసం 32 కొలనులు ఏర్పాటు చేస్తున్నామని కోరారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం సాఫీగా జరిగేలా పనుల పరిశీలించారు మంత్రులు. 
ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం సందర్భంలో గణేష్ విగ్రహం పూర్తిగా నిమజ్జనం కాకపోవడం, నిమజ్జనం సందర్భంగా ఏర్పడే ఇబ్బందులు తొలిగించాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఈరోజు మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో మలేషియా డ్రోన్ టెక్నాలజీ ద్వారా నిమజ్జన ప్రక్రియ సాఫీగా జరిపే విధానాన్ని పరిశీలించారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఖైరతాబాద్ గణేష్ ను హుసైన్ సాగర్లో ఎక్కడ నిమజ్జనం చేస్తే విగ్రహం పూర్తిగా నిమజ్జనం అవుతుంది అన్న సమాచారాన్ని డ్రోన్ చెరువు లోకి తన సిగ్నల్స్ పంపడం ద్వారా లోతు ఖచ్చితత్వం తెలియచేసి విగ్రహ నిమజ్జనం పూర్తిగా జరిగేలా చేస్తుంది. అలాగే లోతు తక్కువగా ఉన్న చోట రాక్ ఉందా మట్టి ఉందా చెక్ చేయడం మట్టి ఉన్న చోటును గుర్తించి అవసరం అయితే విగ్రహం లోతుకు అనుగుణంగా అక్కడ  తాత్కాలికంగా లోతు తవ్వడం ద్వారా నిమజ్జనం జరుపనున్నారు