విజయవాడ, ఆగస్టు 21 (way2newstv.com)
జ్యోతి ప్రజ్వలన చేయడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ నిరాకరించారనే వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన జగన్.. డల్లాస్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సభలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా జ్యోతిప్రజ్వలన చేయాలని సభికులు కోరగా.. జగన్ అందుకు నిరాకరించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ‘‘వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గారు అమెరికాలో ఒక కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడానికి నిరాకరించడం ఖచ్చితంగా హిందువులను అవమానించడమే. ఎన్నికల సమయంలో హిందువుల ఓట్ల కోసమే ఆయన దేవాలయాల చుట్టూ తిరుగుతూ నటించారని అర్థం అవుతుంద’’ని సీఎం రమేశ్ ఓ ట్వీట్ వదిలారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు.
అమెరికాలో జ్యోతి ప్రజ్వలన దుమారం
హిందూ ముద్రతో ఏపీ ప్రజలకు దగ్గరయ్యే అవకాశం కోసం ఎదురు చూస్తోన్న కమలం పార్టీ నేతలకు డల్లాస్ జ్యోతి ప్రజ్వలన వ్యవహారం ఓ ఆయుధంలా మారింది. ఓట్ల కోసం గుళ్లు, గోపురాల చుట్టు తిరిగి, నదీ స్నానాలు చేసిన జగన్.. ఇప్పుడు హిందూ వ్యతిరేకిలా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ జ్యోతిప ప్రజ్వలనకు ఎందుకు నిరాకరించారని ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ సునీల్ దేవ్‌ధర్ కూడా ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. వైసీపీ అధ్యక్షుడు @ysjagan గారు అమెరికాలో ఒక కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడానికి నిరాకరించడం ఖచ్చితంగా హిందువులను అవమానించడమే. ఎన్నికల సమయంలో హిందువుల ఓట్ల కోసమే ఆయన దేవాలయాల చుట్టూ తిరుగుతూ నటించారని అర్థం అవుతుంది. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ కూడా ఘాటుగానే స్పందించింది. లోపలి వెళ్లడానికి ముందు పూర్ణ కుంభ స్వాగతం పలికితే సీఎం జగన్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. వేదిక మీదకు వచ్చే ముందు హారతి ఇచ్చి కుంకుమ తిలకాన్ని నుదుటన దిద్దితే సీఎం కాదనలేదు. కానీ బీజేపీ ఇలాంటి దుష్ప్రచారం చేయడం నిజంగా సిగ్గు చేటని వైఎస్ఆర్సీపీ మండిపడింది. బీజేపీ ప్రచారాన్ని ఖండిస్తూ ట్వీట్ చేసింది. అమెరికాలోని అగ్నిమాపక నిబంధనల ప్రకారం జ్యోతిప్రజ్వలన చేయడం కుదరదు. ఎలక్ట్రిక్ దీపం మాత్రమే ఉందక్కడ. నూనె పోసి వెలిగించే దీపం లేదు. గౌరవభావంతోనే సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన దగ్గరకు వెళ్లి తర్వాత తిరిగి తన సీటు దగ్గరకు వెళ్లారు. ఇక అగౌరవపర్చడం అనే మాటకు తావెక్కడిది అని వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ ద్వారా బీజేపీని ప్రశ్నించింది.
Tags:
Andrapradeshnews