తడిసి మోపడవుతున్న మిల్లింగ్ ఛార్జీలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తడిసి మోపడవుతున్న మిల్లింగ్ ఛార్జీలు

వరంగల్, ఆగస్టు 17, (way2newstv.com)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కస్టమ్స్ మిల్లింగ్ వల్ల తీవ్ర నష్టా లు ఎదుర్కొంటున్న రైస్ మిల్లర్లు పేరుకుపోయిన బకాయిల వల్ల పరిశ్రమలు నడపలేని పరిస్థితుల్లో ఉన్నామ ని ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి నిశ్చయించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.600 కోట్ల కస్టమ్స్ మిల్లింగ్ చార్జిల బకాయిలు పేరుకుపోయి ఉండడం వల్ల పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమైందని రైస్ మిల్లర్లు తీవ్రమైన నిర్ణయాలకు వచ్చారు. బకాయిలుగా ఉన్న మిల్లింగ్ చార్జిలలో ఒక ఉమ్మడి జి ల్లా నుంచే రూ.90 కోట్ల పై చిలుకు బకాయిలు ఉండ గా రాష్ట్ర వ్యాప్తంగా రూ.600 కోట్లకు బకాయిలు పేరుకపోయి ఉన్నాయి. వీటిని చెల్లించాలని గతంలో రైస్ మిల్లర్ల సంఘం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కా రం కాలేదు. ఈ మేరకు రాష్ట్ర రైతు మిల్లర్ల సంఘం ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది. 

తడిసి మోపడవుతున్న మిల్లింగ్ ఛార్జీలు

ఈ మేరకు ఈనెల 20వ తేదీ వరకు ప్రభుత్వం బకాయిలను చెల్లించకుంటే నిరవధిక ఆందోళనకు సిద్ధం కావాలని అందుకు సంబంధించిన కార్యాచరణ 20వ తేదీన తయారు చేయాలని రాష్ట్ర రైతు మిల్లర్ల సంఘం తీర్మానించింది. ఈ తీర్మానంతో రాష్ట్ర రైతు మిల్లర్ల సంఘం మరో తీర్మానాన్ని కూడా చేసింది. ఖాయిలా పడ్డ పరిశ్రమలకు ప్రభుత్వం చేయూతనందించాలని, బ్యాంకుల సరళీకరణ విధానాలు ఒకే విధంగా అన్ని బ్యాంకులు పాటించే విధంగా రిజర్వు బ్యాంకుకు సంబంధిత ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం జారీ చేయాలని తీర్మానించా రు.ఉమ్మడి జిల్లాలో రూ.100 కోట్ల కస్టమ్ మిల్లింగ్ చార్జిలు బకాయిలుగా ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర రైతు మిల్లర్ల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ప్రధాన చర్చను ప్రభు త్వ సహకారం, రైస్ మిల్లర్ల భవితవ్యంపై చర్చ కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం లెవీ విధానాన్ని రద్దు చేసి కస్ట మ్ మిల్లింగ్ విధానాన్ని తీసుకరావడం వల్ల పరిశ్రమ ఉ నికికే ప్రశ్నార్థకమైందని పేర్కొన్నారు. రెండు సంవత్సరాలుగా కస్టమ్ మిల్లింగ్ చార్జీలు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల పరిశ్రమలపై ఆధారపడిన కార్మికులు యజమాన్యం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల పరిశ్రమలు ఎక్కువ శాతం తెలంగాణ రాష్ట్రంలో మూతబడుతున్నాయన్నా రు. ప్రస్తుతం మిల్లింగ్‌లో బ్యాంకులు ఒకేసారి పరిశ్రమ ల అప్పులు కట్టాలని ఒత్తిడి చేయడం వల్ల పరిశ్రమలు నడపలేని పరిస్థితి రావడంతో వాటిని బ్యాంకర్లు స్వాధీన పరుచుకున్నారు. ఆ మిల్లులన్నింటికి వివిధ బ్యాంకుల రుణాలు ఉన్నందున వన్‌టైమ్ సెటిల్‌మెంట్ అనేది ఒకే విధానంతో కొనసాగాలని రైస్ మిల్లర్లు పేర్కొన్నారు. వివిధ రకాల ప్రైవేటు వాణిజ్య బ్యాంకులు ఉండడం వల్ల ఒక్కొక్కరి విధానం ఒక్కొక్క విధంగా ఉం డడంతో అప్పుల చెల్లింపుల్లో సమస్య కొలిక్కి రావడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను గుర్తించి ఎస్‌బిఐ దేశవ్యాప్తంగా ఎస్‌బిఐ అకౌంట్లకు ఒ క విధానాన్ని పాటిస్తుందని ఎస్‌బిఐ విధానాన్నే అన్ని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు అనుకరించాలని వారు డి మాండ్ చేశారు. ఖాయిలాపడ్డ పరిశ్రమలు బ్యాంకుల పరమైన పరిశ్రమలు నడవాలంటే రెండు సంవత్సరాల పాటు వడ్డీ లేకుండా పరిశ్రమలను నడిపేందుకు ప్రభు త్వం మధ్యవర్తిగా ఉండి ఆదుకోవాలని వారు డిమాండ్‌ను పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు ప్రో త్సాహాన్ని అందించడానికి ముందుకు వస్తున్నదని దానికంటే ముందు పాత పరిశ్రమలను బలోపేతం చేయాల ని మిల్లర్ల సంఘంప్రభుత్వానికి సూచన చేయనుంది. ఉమ్మడి జిల్లాలో 400 బాయిల్డ్ రారైస్ మిల్లులు ఉంటే అందులో 60 నుంచి 70 శాతం మిల్లు లు పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయి ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలని గతనెల నుంచి రాష్ట్ర రైతు మిల్లర్ల సంఘంపై ఒత్తిడి తీసుకరావడంతో ఇటీవల రాష్ట్ర రైతు మిల్లర్ల సమావేశం నిర్వహించినట్లు ఉమ్మడి జిల్లా రైస్ మిల్లర్లు పేర్కొంటున్నారు.