పారదర్శకంగా వాలంటీర్ల పరీక్షలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పారదర్శకంగా వాలంటీర్ల పరీక్షలు

చిత్తూరు, ఆగస్టు 24, (way2newstv.com)
సెప్టెంబర్ 1 నుండి జిల్లాలో జరగబోయే గ్రామ/వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి సంబంధించిన వ్రాత పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా సచివాలయం లోని సభా భవనం లో సెప్టెంబర్ 1 వ తేది నుండి ప్రారంభం కాబోయే గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబందించిన పరీక్షల ఏర్పాట్ల పై తీసుకున్న చర్యల పై పాత్రికేయుల సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో సెప్టెంబర్ 1 నుండి గ్రామ/వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి పరీక్షలు జరగనున్నదన్నారు. ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు తమ వంతు కృషి చేయాలన్నారు. 
పారదర్శకంగా వాలంటీర్ల పరీక్షలు

జిల్లాలో ఈ పరీక్షలు సెప్టెంబర్ 1, 3, 4, 6, 7, 8 తేదీలలో జరగనున్నదన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి 60 మంది జిల్లా స్పెషల్ ఆఫీసర్లు అలాగే 450 సెంటర్ స్పెషల్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు. పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆర్టీసీ వారు బస్సుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయం కన్నా అర్థ గంట ముందుగానే చేరుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో మౌలిక సదుపాయాలైన విద్యుత్, త్రాగునీరు, తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి మండల కేంద్రంలో విద్యుత్ ఏఇ ని నియమించడం జరిగిందని తెలిపారు. పరీక్షల సమయంలో పటిష్టమైన బందోబస్తుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. పరీక్షలను పకద్భందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని తెలిపారు. విద్యార్థులు ఎటువంటి అపోహలకు లోనూ కాకుండా బాగా చదువుకుని పరీక్షలను ప్రశాంతంగా వ్రాయాలని తెలిపారు. పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ లను, ఓఎంఆర్ షీట్ లను స్ట్రాంగ్ రూమ్ లో భధ్రపరచడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టడం జరుగుతూ ఉందన్నారు. ఈ పరీక్షలు ఉదయం పూట 10 గం.లకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గం.ల వరకు కొనసాగుతుందని, అలాగే మధ్యాహ్నం పూట పరీక్ష 2.30 గం.లకు ప్రారంభమై సాయంత్రం 5 గం ల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ లు, హెడ్ ఫోన్ లు, తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబడదన్నారు. పరీక్షలు వ్రాసే అభ్యర్థులు బ్లూ బాల్ పెన్ గాని, బ్లాక్ బాల్ పెన్ కానీ వినియోగించాలన్నారు. పరీక్షలు వ్రాసే అభ్యర్థులు పరీక్షల అనంతరం ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ ను ఇన్విజిలేటర్ కు అందజేసి, డూప్లికేట్ ఓఎంఆర్ షీట్ ను అభ్యర్థి తీసుకెళ్లాలన్నారు. పరీక్షలకు సంబంధించి 1902 టోల్ ఫ్రీ నెంబర్ ను 
ఏర్పాటు చేయడం జరిగిందని విద్యార్థులకు, అధికారులకు పరీక్షలకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే సందేహాల పరిష్కారానికి చర్యలు చేపడతారన్నారు. పరీక్షలకు సంబంధించి విద్యార్థులు ఈ నెల 28 నుండి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకొనవచ్చునన్నారు. సెప్టెంబర్ 1 వ తేదిన ఉదయం 380 కేంద్రాలలో 1,07,715 మంది అభ్యర్థులు, అలాగే మద్యాహ్నం 103 కేంద్రాలలో 28,194 మంది అభ్యర్థులు 41 మండల హెడ్ క్వార్టర్ లు మరియు మున్సిపాలిటీలలో పరీక్షలు వ్రాస్తున్నారని తెలిపారు. సెప్టెంబర్ 3 నుండి 8 వ తేది వరకు పరీక్షలన్నీ తిరుపతి లోనే జరుగుతుందని తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఒక్క పరీక్షా కేంద్రానికి వైద్యశాఖ తరఫున ఒక వ్యక్తి అందుబాటులో ఉంటారన్నారన్నారు. పరీక్షలకు సంబంధించి 4 హాళ్ళకు ఒక వీడియో గ్రాఫర్ ఉంటారని ఈ వీడియో గ్రాఫర్ లాంగ్ షాట్ లోనే పరీక్షలను కవర్ చేయాలని తెలిపారు. ఈ విలేకరుల సమావేశం లో జిల్లా జాయింట్ కలెక్టర్ డి. మార్కండేయులు, జె సి 2 చంద్రమౌళి, శిక్షణా కలెక్టర్ పృథ్వీ తేజ్, జెడ్పీ సిఇఓ కోదండ రామి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు