యడ్యూరప్పకు కలిసి రాని కాలం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

యడ్యూరప్పకు కలిసి రాని కాలం

బెంగళూర్, ఆగస్టు 14 (way2newstv.com)
యడ్యూరప్ప ఏ ముహూర్తాన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో గాని వరసగా ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసి పదిహేను రోజులు దాటుతోంది. ఇప్పటి వరకూ మంత్రి వర్గ విస్తరణను యడ్యూరప్ప చేపట్ట లేకపోయారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం వివిధ పనుల్లో బిజీగా ఉండటం కూడా ఒక కారణం కాగా, వరదలు, వానలతో రాష్ట్రం అతలాకుతలవ్వడమే.ముఖ్యమంత్రి ఒక్కరే అన్ని పనులు చేయాలంటే సాధ్యమయ్యే పనికాదు. ముఖ్యంగా వరదల సమయంలో మంత్రులు లేని లోటు కొట్టొచ్చినట్లు కన్పించింది.  
యడ్యూరప్పకు కలిసి రాని కాలం
వరద సహాయ కార్యక్రమాలను ముఖ్యమంత్రి యడ్యూరప్ప తో పాటు భారతీయ జనతా పార్టీ నేతలు పర్యవేక్షించారు తప్ప మంత్రులు లేకపోవడంతో అధికారులను కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు. అదే మంత్రులు ఉంటే ముఖ్యమంత్రి యడ్యూరప్ప వారికి సహాయ కార్యక్రమాలు అప్పగించి తాను మిగిలిన పనులపై దృష్టి పెట్టేవారు.మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి కేంద్ర నాయకత్వం ఇంకా యడ్యూరప్పకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మంత్రి వర్గం జాబితాను యడ్యూరప్ప సిద్ధం చేసి పెట్టుకున్నారు. అధిష్టానం పిలుపు కోసం ఆయన నిరీక్షిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ విభజన అంశంలో బీజేపీ కేంద్ర పెద్దలు బిజీగా ఉండటంతో మంత్రివర్గ విస్తరణను కేంద్ర నాయకత్వం పక్కన పెట్టింది. దీంతో యడ్యూరప్ప కూడా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి చేయలేకపోతున్నారు.నిజానికి యడ్యూరప్ప ఎప్పుడో మంత్రివర్గ విస్తరణ చేపట్టేవారు. కానీ అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల విషయం పై ఇంకా స్పష్టత రాలేదు. దాదాపు యాభై మంది వరకూ బీజేపీ నేతలు మంత్రివర్గంలో చేరడానికి పోటీ పడుతున్నారు. కొందరు ఏకంగా అధిష్టానానికి అప్పీల్ కూడా చేసుకున్నారు. అందుకే యడ్యూరప్ప కూడా మంత్రివర్గ విస్తరణను అధిష్టానానికే వదిలేస్తే తాను నాలుగు ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తం మీద యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా చేపట్టిన ముహూర్తం బాగా లేనట్లుంది.