పాములపాడు ఆగస్టు 8 (way2newstv.com - Swamy Naidu)
పాములపాడు మండల పరిధిలోని మద్దూరు గ్రామం లో నందికొట్కూరు శాసనసభ్యుడు తోగురు ఆర్థర్ గురువారం పర్యటించారు మద్దూరు గ్రామంలోని అంగన్ వాడి కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలో పరిశీలించారు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు అనంతరం గ్రామంలోని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు .
సొంత గ్రామంలో ఎమ్మెల్యే ఆర్థర్ పర్యటన.
మద్దూరు గ్రామానికి బస్సు సౌకర్యం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు అనంతరం ఆత్మకూరు డిపో మేనేజర్ మాట్లాడి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు రైతులు వేసిన పంటల గురించి అడిగి తెలుసుకున్నారు ఎస్ఐ రాజ్ కుమార్ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు ఎమ్మెల్యే వెంట వైసిపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి , ముర్తుజావలి, చౌడయ్య, తదితరులు పాల్గొన్నారు
Tags:
telangananews