రాజ్యాంగాన్ని అవమానించేలా కేసీఆర్ పాలన

అధికార కేంద్రీకరణ కోసమే కొత్త మునిసిపల్ చట్టం
కేసీఆర్ నియంతలా పాలన చేస్తున్నారు
 రాజీవ్ గాంధీ 75వ జయంతి సభలో సీఎల్పీ నేతల భట్టి విక్రమార్క
హైదరాబాద్,  ఆగష్టు 20 (way2newstv.com):
భారతదేశాన్ని 21వ శాతాబ్దంలోకి తీసుకువెళ్లిన గొప్ప దార్శనికుడు మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన వేసిన పునాదులపై నేడు భారతదేశం శరవేగంగా అభివ్రుద్ధి చెందుతోందని, ప్రపంచదేశాలతో భారత్ పోటీ పడేస్థాయికి ఎదిగిందని భట్టి చెప్పారు. ఆదునిక కంప్యూటర్ విప్లవానికి నాంది పలికి..  టెక్నాలజీ మెషిన్స్ ను మనకు ఆయన అందించారని అన్నారు. యువతను రాజకీయాల్లో భాగం చేయడంలోనూ, వారికి నాయకత్వ బాధ్యతలు అందించడంలోనూ రాజీవ్ గాంధీ చొరవ చూపారని చెప్పారు. 
రాజ్యాంగాన్ని అవమానించేలా కేసీఆర్ పాలన

పంచాయితీరాజ్ చట్టాన్ని బలోపేతం చేసే దిశలో భాగంగా 73,74 రాజ్యాంగ సవరణ తీసుకువచ్చారని అన్నారు. అంతేకాక అధికార వికేంద్రీకరణ ద్వారా అభివ్రుద్దిని ముందుకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అయితే రాష్ట్రంలో పాలన సాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం 73, 74 రాజ్యాంగ సవరణకు తూట్లుపొడిచేలా వ్యవహరిస్తోందని అన్నారు. మొత్తం అధికారాలన్నీ కేంద్రీక్రుతం చేసుకుని రాచరిక, నియంత పాలన చేయాలని కేసీఆర్ చూస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. అందులో భాగంగానే కొత్త మునిసిపల్ చట్టం తీసుకువచ్చారని అన్నారు. ఇదిభారత రాజ్యాంగాన్ని అవమానించడమేనని భట్టి విక్రమార్క చెప్పారు. ఇటువంటి నియంతల పాలననుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ  చూపించిన మార్గంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు సాగాలని భట్టి ఆకాంక్షించారు.
Previous Post Next Post