అశ్లీల వెబ్ సైట్లపై హైకోర్డు ఆగ్రహం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అశ్లీల వెబ్ సైట్లపై హైకోర్డు ఆగ్రహం

హైదరాబాద్, ఆగష్టు 20 (way2newstv.com):
అశ్లీల వెబ్ సైట్ల పై తెలంగాణ హైకోర్టు సీరియస్ యింది. అశ్లీల వెబ్ సైట్ల పై గూగుల్ సంస్థ కు నోటీసులు జారీ చేసింది. అశ్లీల వెబ్ సైట్ల పై పూర్తి వివరాలు ఇవ్వాలని గూగుల్ సంస్థ కు హైకోర్టు ఆదేశించింది. ఫేస్ బుక్ లో ఉన్న పేర్లను వారి ఫోటోలను తీసుకొని ఫోర్న్ వెబ్ సైట్ల లో  పెడుతున్నారని ఒక యువతి  హైకోర్టు ను ఆశ్రయించింది. 
అశ్లీల వెబ్ సైట్లపై హైకోర్డు ఆగ్రహం

తన పేరు,ఫోటోలను ఫోర్న్ వెబ్ సైట్ నుంచి తొలగించాలని గతంలో గూగుల్ సంస్థ కు ఫిర్యాదు చేసింది. గూగుల్ సంస్థ పట్టించుకోకపోవడంతో హైకోర్టు ను ఆశ్రయించింది. అశ్లీల వెబ్ సైట్లు సృష్టిస్తున్న వారిపట్ల గూగుల్ సంస్థ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని  హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలు తెలియజేయాలని గూగుల్ సంస్థ కు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్1 కి వాయిదా వేసింది.