చిరుధాన్యాలతో ఆరోగ్యం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చిరుధాన్యాలతో ఆరోగ్యం

అలవాటుగా మార్చుకుంటున్న జనాలు 
కరీంనగర్, ఆగస్టు 23, (way2newstv.com)
చాలా మంది ఆరోగ్యవంతమైన డైట్ వైపు మరులుతున్నారు. అందుకు తోడు ఆరోగ్య నిపుణులు కూడా చిరు ధాన్యాలను మెనూలో చేర్చమంటున్నారు.చిరుధాన్యాల్లో ఒక్కటైన జొన్నల్లో పోషకాలు , ప్రోటిన్‌లు, పిచు పదార్థాల్లో అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులను దూరం చేస్తాయని వైద్య పరిశోధనల్లో తేలింది. నారాల బలహీనత , మానసిక రుగ్మత, కాళ్లు, చేతుల మంటలు, నొట్ల పుండ్ల నుంచి కాపాడుతాయి.అందు వల్ల వీటిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.ఇ సజ్జలు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. 
చిరుధాన్యాలతో ఆరోగ్యం

ఎక్కువగా ఎండకాలంలో వీటిని ఉపయోగిస్తారు. సజ్జ గింజలు నానబెట్టి వీటిని తాగడం వల్లన దాహం తీరడమేగాక దగ్గు, అస్తామా, మంటలు, తలనొప్పి, జ్వరం వంటి సమస్యలు రావు. అదే విధంగా శరీరంలోని కొవ్వు తగ్గించడంలో ఇవి బాగా  పనిచేస్తాయి. అజీర్తిని తగ్గిస్తాయి. ఇందులో పిచు పదార్థాలతో పాటు మాంసంకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఇనుము, కాలుష్యం, తయామిస్ వంటి పదార్థాలన్ని ఉంటాయి.ఉబ్బసంతో బాధపడేవారు కొర్రలను అన్నంలో వండుకొని తిన్నడం వల్లన సమస్య అదుపులోకి వస్తుంది. మంచి బలవర్థకమైన ఈ ఆహారంపై ప్రతి ఒక్కరికి అవగాహన పెరిగింది. దీని వల్ల చాలా మంది కొర్రలతో వంట చేసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలకు ఇది మంచి బలవర్థకమైన ఆహారమని చెప్పాలి. వీటిలో ఉండే యాంటి అక్సిడెంట్‌ల ద్వారా ఉదర సంబంధ వ్యాధులు గుండె సమస్యలు, కీలవాతం, రక్తస్త్రావం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ప్రొటిన్లు, కొవ్వు పదార్థాలు, ఫైబర్, మినరల్, కాలుష్యం ఎక్కువగా ఉంటాయి. వీటి వల్లన శరీరానికి అదనపు శక్తి వస్తుంది. అజీర్థి సమస్య దూరం చేసుకోవచ్చు. అదే విధంగా మైగ్రేన్ సమస్య కూడా దూరమవుతుంది. తియ్యగా ఉండే వీటి వల్ల శరీరానికి మాంసంకృత్తులు లభిస్తాయి.వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి  రాగులు తీసుకోవడం ఎంతో మంచిది. శరీరానికి చల్లదనం ఇస్తాయి. వి కాంప్లెక్స్ అధికంగా ఉండే వీటిని తీసుకోవడం వల్ల పెరుగుదల అధికంగా ఉంటుంది. అంతే కాకుండా ఎముకలు, కండరాలు, నారాలు బలంగా ఉంటాయి. వీటి వల్ల పేగు క్యాన్సర్ దూరమవుతుంది.ప్రొటిన్స్, కొవ్వు పదార్థాలు, ఫైబర్, మినరల్ అధికంగా ఉండే అరికెలు వల్ల శక్తి వస్తుంది. ఊదలు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కూర్చొని పనిచేసే వారికి ఇవి మంచి ఆహారం. అవిసెలా వల్లన పోషకాలు అధికంగా లభిస్తాయి. పిల్లల్లో శరీరక ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిలను అదుపు చేస్తుంది. మధుమేహా వ్యాధిగ్రస్తులు వీటిని తరుచుగా తీసుకోవడం మంచిది. చిరు ధాన్యాలతో జీర్ణశక్తి మెరుగవుతుంది. వీటిలో ఉండే పోషకాలు గుండె జబ్బులు, డయాబెటిస్‌ను దరిచేయనీయవు. పైన సూచించిన చిరు ధన్యాలను తమ ఆహారంలో భాగం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు.