తెలంగాణ బీజేపీలో - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణ బీజేపీలో

రామ్ మాధవ్ వర్సెస్ మురళీధరరావు
హైద్రాబాద్, ఆగస్టు 23, (way2newstv.com)
తెలంగాణ బీజేపీలో చేరుతున్న వారంతా, జాతీయపార్టీలో కీలకంగా ఉన్న నేతనే నమ్ముతున్నారా..? తెలంగాణ రాష్ట్ర పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా కొత్త నేతలంతా ఆయన అపాయింట్ మెంట్ కోసం పడిగాపులు కాయడమేంటి..? తెలంగాణలో జాతీయ పార్టీ నేతలున్నా ఆ కీలకనేత వైపే మొగ్గుచూపడం వెనుక ఆంతర్యమేంటని జోరుగా చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలు సీనియర్ నేత, మురళీధర్‌ రావుకు కోపం తెప్పిస్తున్నాయట. సదరు జాతీయ నేతపై లోలోపల రగిలిపోతున్నారట. వలసల వేడి, తెలంగాణ బీజేపీలో కాక రేపుతోందా? తెలంగాణలో బలపడాలని, క్షేత్రస్థాయిలో మరింతగా పుంజుకుని, వచ్చే ఎన్నికల్లో విజయభేరి మోగించాలని రకరకాల వ్యూహాలు వేస్తోంది బీజేపీ. అందుకే వలసలకు గేట్లేత్తేసింది. మొన్న బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ నడ్డా సమక్షంలోనూ చేరికలు జరిగాయి.
తెలంగాణ బీజేపీలో 

రాబోయే రోజుల్లో మరింత ఉధృతమవుతాయని తెలుస్తోంది. అయితే వలసల నేపథ్యంలో, స్టేట్ బీజేపీలో కోల్డ్‌వార్‌ సాగుతోందన్న చర్చ హీటెక్కిస్తోంది. వలసలైతే బీజేపీలోకి ఊపందుకుంటున్నాయి గానీ, కేవలం బీజేపీ జాతీయప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ద్వారానే కండువాల కార్యక్రమం సాగుతోందని, పార్టీలో చర్చ జరుగుతోంది. రాంమాధవ్‌ ద్వారానే, పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. మొదట మాజీ మంత్రి డికే అరుణ రాంమాధవ్ ద్వారా అమిత్‌ షా సమక్షంలో, బిజేపి తీర్థం పుచ్చుకోవడంతో అందరు నేతలు రాంమాధవ్ దారి పట్టడం మొదలయ్యింది. మాజీ ఎంపి గడ్డం వివేక్ సైతం రాంమాధవ్ ద్వారానే పార్పీలో చేరడానికి ఆసక్తి చూపారు. తెలంగాణ బీజేపీలోనూ, జాతీయస్థాయిలోనూ కీలకంగా ఉన్న మరో నాయకుడు మురళీధర్‌ రావు మాత్రం, కేవలం రాంమాధవ్‌ ద్వారానే, వలసలు సాగడంపై ఒకింత అసహనంతో ఉన్నారన్న చర్చ, పార్టీలో జరుగుతోంది. తన ప్రాధాన్యత కావాలనే తగ్గిస్తున్నారని ఆయన భావిస్తున్నారని, మాట్లాడుకుంటున్నారు కాషాయం కార్యకర్తలు. ఇతర కీ లీడర్స్‌ది అదే ఫీలింగ్ అట. అయితే, రాష్ట్ర్రంలో, పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించే పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, పార్టీలో కొత్త చేరికల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారట. ఆయన నేరుగా పార్టీలో చేరాలనుకుంటున్న వారిని, జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ దగ్గరకు పంపుతున్నారనే చర్చ పార్టీలో జోరుగా వినిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న జాతీయప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఉన్నా, ఆయన వద్దకు వెళ్లకుండా శ్రీనివాస్ అడ్డుకుంటుంన్నారన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడిగా లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, రాంచందర్ రావులు పార్టీలో ఉన్నా, వీళ్లను కనీసం పరిగణలోకి తీసుకోకుండా అందరూ నేరుగా రాంమాధవ్ వద్దకు వెళ్లడం, పార్టీలో నేతలకు రుచించడంలేదట. కానీ పార్టీలో చేరాలనుకుంటున్నవాళ్లంతా రాంమాధవ్‌ను ఎంపిక చేసుకోవడం వెనుక పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి మంత్రిజి హస్తం ఉందనే గుసగుస పార్టీలో వినిపిస్తోంది. మిగతా కీలక నేతలతో పాటు రాంమాధవ్‌ కంటే తానెంత మాత్రం తక్కువ కాదన్నట్టు భావిస్తున్న మురళీధర్‌ రావుకు, ఈ పరిణామాలు అస్సలు రుచించడం లేదట. అయితే, అందరూ రాంమాధవ్ వైపు మొగ్గుపూడం వెనుక మంత్రిజీ హస్తంతోపాటు ఆయన ద్వారా పార్టీలో చేరితే, పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని అందరూ నమ్ముతున్నారనే చర్చ కూడా ఉంది. దీనికితోడు ప్రధాని మోడి, అమిత్‌ షాలతో మాధవ్ సన్నిహితంగా ఉండడం కూడా, నేతలు ఆయనను ఎంచుకోవడానికి కారణమని తెలుస్తోంది. ఈ వ్యవహారం రాష్ట్ర పార్టీ నేతలెవ్వరికీ రుచించడం లేదని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. కోల్డ్‌వార్‌ కుంపట్లకు దారితీసేలా ఉన్నా వలసల వేడి, చివరికి ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న చర్చ పార్టీలో సాగుతోంది.