సిక్కోలులో టీడీపీ కి దారేదీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిక్కోలులో టీడీపీ కి దారేదీ

శ్రీకాకుళం, ఆగస్టు 21, (way2newstv.com)
గ‌న్ సునామీ దెబ్బతో కుదేలైన తెలుగుదేశం పార్టీ ఇప్పట్లో ప‌ట్టాలెక్కే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. నిజానికి ఇక్కడ నుంచే రాష్ట్ర టీడీపీకి అధ్యక్షుడు ఉండ‌డం గ‌మ‌నార్హం. అయినా కూడా పార్టీ ఇప్పట్లో లైన్‌లో ప‌డేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.,. తెలుగుదేశం పార్టీ అధినేత‌., గ‌త సీఎం చంద్రబాబు.. శ్రీకాకుళం జిల్లాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా తిత్లీ తుఫాను వ‌చ్చిన స‌మ‌యంలో ఇక్కడ ఆయ‌న నిరంత‌రం ప్రజ‌ల‌కు అందుబాటులో ఉన్నారు. ఎన్నిక‌ల‌కు ముందు తుఫాను రావ‌డంతో ప్రజ‌ల‌కు అన్నీతానై వ్యవ‌హ‌రించారు. అక్కడే తిష్టవేసి మ‌రీ స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టారు.చేతికి ఎముక‌లేద‌న్నట్టుగా.. ఆయ‌న బాధితుల‌కు సాయం చేశారు. 
సిక్కోలులో టీడీపీ కి దారేదీ 

అయితే, ఎన్నిక‌ల్లోకి వ‌చ్చే స‌రికి ఇక్క డ నుంచి కేవ‌లం ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ మాత్రమే విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం. టెక్కలి నుంచి కింజ‌రాపు అచ్చెన్నాయుడు, ఇచ్చాపురంలో బెందాళం అశోక్ విజ‌యం సాధించ‌గా శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి రామ్మోహ‌న్‌నాయుడు వ‌రుస‌గా రెండో సారి విజ‌యం అందుకున్నారు.ఇక‌, శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సీనియ‌ర్ గుండ ల‌క్ష్మీదేవి, అదేవిధంగా రాజాం నుంచి అతి క‌ష్టంమీద టికెట్ ద‌క్కించుకున్న కొండ్రు ముర‌ళి, ఎచ్చర్ల నుంచి బ‌రిలో నిలిచిన క‌ళా వెంక‌ట్రావు, ప‌లాసలో గౌతు వార‌సురాలు శిరీష వంటి హేమా హేమీలు విజ‌యానికి దూర‌మ‌య్యారు. గెలిచిన వారిలో ఒక్క అచ్చెన్న అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ గ‌ళం వినిపిస్తుండ‌గా, బెందాళం గ‌తంలో మాదిరిగానే మౌనం గానే ఉంటున్నారు. ఇక‌, ఎంపీ రామ్మోహ‌న్ త‌న స‌త్తాను పార్లమెంటులో చూపిస్తున్నారు.ఇక‌, మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి చాలా ద‌య‌నీయంగా మారింది. సాక్షాత్తూ రాష్ట్ర అధ్యక్షుడు క‌ళా వెంకట్రావే ఓడిపోయిన నేప‌థ్యంలో ఇక్కడ పార్టీని ద‌శ దిశ చూపించే వారే క‌రువ‌య్యార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మ‌రోప‌క్క, శ్రీకాకుళం, ప‌లాస వంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు త‌మ హ‌వా ప్రద‌ర్శిస్తు న్నారు. బ‌ల‌మైన వాయిస్ ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష సైతం పార్టీ వాయిస్ వినిపించ‌కుండా స్లో అయ్యారు.ఇక క‌ళా వెంక‌ట్రావు సైతం ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో పొలిటిక‌ల్ కాక హీటెక్కినా మాట్లాడ‌ని ప‌రిస్థితి. ఇక రాజాంలో ఓడిన మాజీ మంత్రి కొండ్రు ముర‌ళీ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆయ‌న‌పై బీజేపీలో చేరాల‌న్న ఒత్తిళ్లు ఉన్నాయ‌ట‌. మరో వైసీపీ నాయ‌కులు ఎక్కడిక‌క్కడ టీడీపీ శ్రేణుల‌ను త‌మ పార్టీలో చేర్చుకుంటున్నారు. మ‌రి దీనిని నిలువ‌రించి, జిల్లా టీడీపీ నేత‌లు పార్టీని ముందుకు ఎలా న‌డిపిస్తారో చూడాలి.