మళ్లీ నోరు జారిన రోజా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మళ్లీ నోరు జారిన రోజా

విజయవాడ, ఆగస్టు 27 (way2newstv.com)
రాజకీయ నేతలు అప్పుడప్పుడూ నోరు జారడం మామూలే. తడబాటులో ఏదో చెప్పబోయి.. ఇంకేదో చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రసంగాలు దంచేసే నేతలు కూడా ఒక్కోసారి టంగ్ స్లిప్ అవుతుంటారు. మంచి వక్తగా పేరున్న ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా కూడా తడబాటులో మిస్ ఫైర్ అయ్యారు. పొరపాటున నోరు జారారు. ఇక అవకాశం కోసం ఎదురు చూస్తున్న తెలుగు తమ్ముళ్లు ఆగుతారా.. వెంటనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ బాధ్యతలు చేపట్టారు. 
మళ్లీ నోరు జారిన రోజా

ఈ కార్యక్రమానికి రోజా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రోజా.. గత టీడీపీ సర్కార్‌, చంద్రబాబు, మాజీ స్పీకర్ కోడెలపై ఆరోపణలు చేసే క్రమంలో తడబడ్డారు. ‘కారు షెడ్డులో ఉండాలి. ఆడది ఇంట్లో ఉండాలి అని చెప్పిన పెద్ద మనిషి పరిపాలనలో మహిళలకు ఏం న్యాయం జరుగుతుందో మనం అందరం చూశాం. ముఖ్యమంత్రి ఉన్నాడు అసలు.. ఆడవాళ్ల పుట్టుకనే అవమానిస్తాడు’ అంటూ రోజా వ్యాఖ్యలు చేశారు. అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా సంబోధించారు. రోజా వ్యాఖ్యలతో అక్కడ వేదికపై ఉన్నవాళ్లు షాక్ తిన్నారట. తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావన రావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.. రోజా 
ఫ్లోలో అలా అనేశారని భావించారు. ఈ వీడియోను తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రోజాను టార్గెట్ చేస్తూ సెటైర్లు పేలుస్తున్నారు. చంద్రబాబును రోజా ఇంకా ముఖ్యమంత్రిగా భావిస్తున్నారా అంటూ ట్రోల్ చేస్తున్నారు