విజయవాడ, ఆగస్టు 28, (way2newstv.com)
దాడి.. నలుపక్కల నుంచి విపరీతమైన దాడి. మాటల శతఘ్నులు మోగుతున్నాయి. నినాదాల పిడుగులు పడుతున్నాయ్! ఇవన్నీ ఎవరిమీదో కాదు.. జగన్ ప్రభుత్వంపైనే! నలుదిక్కుల నుంచి విమర్శలు వస్తు న్నాయి. ముఖ్యంగా బీజేపీ-టీడీపీ అప్రకటిత, అనధికార మైత్రితోనా అన్నట్టుగా జగన్‌పై విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఈ పరిస్థితి రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. ఈ వ్యవహారంతో చర్చ లపై చర్చలు సాగుతున్నాయి. అన్ని విషయాలను కూడా భూతద్దంలో చూపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం కూడా రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీసింది.ఇవన్నీ ఇలా ఉంటే.. రాష్ట్రంలో మరో రెండున్నరేళ్ల కాలంలోనే ఎన్నికలు రానున్నాయని అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
బాబుకు ఆశలు పుట్టుకొస్తున్నాయ్...
ఆయన చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్రంలో గతంలో ఏ పార్టీకి దక్కని విధంగా భారీ మెజారిటీ, భారీ ప్రజామోదం ఒక్క జగన్ పార్టీ వైసీపీకి లభించింది. పైకి ఇది బాగానే ఉన్నా.. ఇప్పుడు ప్రధాన పార్టీలైన టీడీపీ, బీజేపీలకు మాత్రం రుచించడం లేదు. ఈ నేపథ్యంలో సంయమనం పాటిస్తామని, కొన్ని రోజుల పాటు జగన్ పాలనను చూస్తామని చెప్పిన టీడీపీ కూడా విమర్శలు చేస్తోంది.ఇక, ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజు నుంచే జగన్ సర్కార్ పై విమర్శించడం ప్రారంభించిన బీజేపీ.. ఇప్పుడు కేం ద్రంలోని బలం చూసుకుని ఇక్కడి నాయకులు రెచ్చిపోతున్నారు. ప్రతి విషయాన్నీ తమకు అనుకూలంగా మారుస్తున్నారు. ఏపీలో విధ్వంసం జరుగుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ లాంటి నాయకులు చెపుతున్నారు. చంద్రబాబు పాలనే బెటర్‌గా ఉందని కన్నా లక్ష్మీనారాయణ లాంటి నేతలు చెపుతున్నాయి.బీజేపీ వాళ్లు పోలవరం నుంచి వరదల వరకు ఎక్కడా వదిలి పెట్టడం లేదు. ఈ మొత్తం పరిణామం గమనిస్తే.. జగన్ విదేశాలకు వెళ్లిన నేపథ్యంలో విమర్శలు మరింత పెరిగాయని చెప్పక తప్పదు. సాధారణంగా రాష్ట్రంలో పాలన ప్రారంభించి పట్టుమని మూడు మాసాలు కూడా కాలేదు. జగన్‌ను టీడీపీతో పాటు బీజేపీ వాళ్లో ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మోదీ ట్రిఫుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు విషయంలో తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడు జమిలీ ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే అందరి అంచనాల ప్రకారం 2022లోనే ఎన్నికలు రానున్నాయి. అందుకే ఇప్పుడు టీడీపీ వాళ్లు ముందస్తు ఎన్నికల ఉత్సాహంతో ప్రకటనలు చేస్తున్నారు. అటు బీజేపీ కూడా జమిలీ ఎన్నికలపై జోరుగా ప్రకటనలు చేయడం చూస్తుంటే ఏపీ రాజకీయం మరింత రసకందాయంలో పడనుంది.