ఆరు గంటల పాటు కలెక్టర్లతో కేసీఆర్ భేటీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆరు గంటల పాటు కలెక్టర్లతో కేసీఆర్ భేటీ

60 రోజుల ప్లాన్ పై దిశానిర్దేశం
హైద్రాబాద్, ఆగస్టు 20 (way2newstv.com)
ప్రగతి భవన్‌లో కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు. కొత్త మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖ అమలుపై చర్చలు జరుపుతున్నారు. ఈ భేటీ బుధవారం కూడా జరిగే అవకాశం ఉంది. ఆగస్టు 15 తర్వాత నుంచి రాష్ట్రంలో అసలైన పాలన చూపిస్తానని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. దానికి సంబంధించి సీఎం కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. సరికొత్త గవర్నెన్స్‌లో భాగంగా ఆయన తీసుకోనున్న నిర్ణయం చాలా కీలకంగా ఉంటుంది. సరికొత్త పాలన కోసం ప్రధానంగా మూడు అంశాలను కేసీఆర్ ఎంచుకున్నారు. 
 ఆరు గంటల పాటు కలెక్టర్లతో కేసీఆర్ భేటీ

1. పంచాయతీరాజ్ చట్టం, 2. మున్సిపల్ చట్టం, 3 కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చి పక్కాగా అమలు చేయడం.పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి కేసీఆర్ ఇప్పటికే యాక్షన్ ప్లాన్ రూపొందించారు. 60 రోజుల కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ 60 రోజుల కార్యాచరణలో గ్రామాల్లో ఏమేమి చేయాలన్నదానిపై సీఎం కలెక్టర్లకు దిశా నిర్దేశం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నది కూడా ఆయన వివరించనున్నారు. అలాగే రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తామని కేసీఆర్ ఎప్పటినుంచో చెబుతున్నారు. సెప్టెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి.. ఆమోదించి.. చట్టంగా తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ మూడు అంశాలపై ముఖ్యమంత్రి కలెక్టర్లతో చర్చించనున్నారు.