పదిహేడు మందితో కర్నాటక కేబినెట్ విస్తరణ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పదిహేడు మందితో కర్నాటక కేబినెట్ విస్తరణ

బెంగళూరు ఆగష్టు 20 (way2newstv.com):
కర్ఱాటక ముఖ్యమంత్రి  బీఎస్ యెడియూరప్ప మంగళవారం నాడు పదిహేడు మందితో కేబినెట్ విస్తరించారు. అనేక నాటకీయ పరిణామాల అనంతరం కర్ణాటకలో భాజపా ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని విశ్వాస పరీక్షలో ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన యడియూరప్ప తాజాగా మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. అధికారం చేపట్టిన  దాదాపు ఇరవై  రోజుల తర్వాత కేబినెట్ విస్తరించారు.
పదిహేడు మందితో కర్నాటక కేబినెట్ విస్తరణ

ఇప్పడివరకు అయన ఒక్కరే ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు.  గోవింద్ మక్తప్ప, అశ్వత్ నారాయణ, లక్ష్మణ్ సంగప్ప,ఈశ్వరప్ప, అశోక, జగదీష్, శ్రీరాములు, ఎస్.సురేష్కుమార్, వి.సోమన్న, సీ.టీ. రవి, బసవరాజు బొమ్మై, శ్రీనివాస్ పుజారి, జేసీ మధుస్వామి, చంద్రకాంతగౌడ, చిన్నప్పగౌడ పాటిల్, హెచ్.నగేష్, ప్రభుచౌహాన్, శశికళ  అన్నాసాహెబ్ లతో గవర్నర్ వాజూభాయి వాలా వారితో ప్రమాణం చేయించారు. మంత్రివర్గ  సహచరులు లేకుండా యెడియూరప్ప ఒక్కడే వుండడాన్ని ప్రతిపక్షాలు తూర్పరపట్టాయి. ఇదే సమయంలో రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి.