అనారోగ్యం బారిన ఏజెన్సీ ప్రాంతాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అనారోగ్యం బారిన ఏజెన్సీ ప్రాంతాలు

రాజమండ్రి, ఆగస్టు 30, (way2newstv.com)
తూర్పు ఏజెన్సీలో వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో గిరిజనుల పరిస్ధి తి దయనీయంగా మారుతోంది. ఆగస్టు నెలలో వర్షాలతోపాటు సీజనల్‌ వ్యాధులు విజృంభించి లోతట్టున ఉన్న ప్రతి గ్రామంలో ప్రజలు రోగాలతో సతమతమవుతున్నారు.పంచాయతీలకు మలేరియా నిర్మూలనకు ఫాగింగ్‌ యంత్రాలు  ఇచ్చినా నిరుపయోగంగా మారాయి. యంత్రాలు వినియోగించేందుకు పంచాయతీలకు ఎటువంటి డబ్బులు ఇవ్వకపోవడంతో వాటిని వాడేందుకు పెట్రోల్‌ కొనుగోలు చేయలేకపోతున్నారు. గత ఏడాది ఇదే సీజన్‌లో వై రామవరం మండలం చాపరాయిలో నెల రోజుల వ్యవధిలో16 మందికి పైగా గిరిజనులు మృత్యువాత పడినప్పటికీ వైద్య సేవలు మెరుగుపరచడంలో ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపించకపోవడం పట్ల గిరిజనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 
అనారోగ్యం బారిన ఏజెన్సీ ప్రాంతాలు

ఏజెన్సీలో గైనకాలజిస్ట్‌లతోపాటు చిన్న పిల్లల వైద్యులు కూడా లేకపోవడంతో మాతాశిశు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక్కడ ఏజెన్సీలో గత ఆరేళ్లు కాలంలో దాదాపు వెయ్యికిపైగా శిశు మరణాలు సంభవించాయంటే ఆధ్వాన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 40 మంది వరకు తల్లులు మృత్యువాత పడ్డారు. మలేరియా జ్వరాలు బారిన పడ్డవారి సంఖ్య తక్కువేమీ లేదు. వ్యా«ధిని గుర్తించి సకాలంలో చికిత్స అందించకపోవడం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయి.రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వాటిలో 42  మంది అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్స్‌ పనిచేయాలి. కానీ 33 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు మాత్రమే రెగ్యులర్‌ వైద్యులు ఉన్నారు. మిగిలిన వారు కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇటీవల తొమ్మిది మంది పీహెచ్‌సీ వైద్యులు తమ పోస్టులకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆరేళ్లు కాలం నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ వైద్యులను రెగ్యులర్‌ చేసి బదిలీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవడంతో వైద్యులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఏజెన్సీలో పీహెచ్‌సీల పనితీరును పర్యేవేక్షించే ఏజెన్సీ డీఎంహెచ్‌ఓ పోస్టు ఖాళీగా ఉంది. పీహెచ్‌సీ పరిధిలో వైద్యులు ఉండేందుకు ఎటువంటి వసతులు కల్పించడం లేదు.ఆరేళ్లు కాలంలో ఏజెన్సీలో మతాశిశు మరణాలు పరిశీలిస్తే ఏజెన్సీలో వైద్య సేవల దుస్థితి ఎలా ఉందో అద్దం పడుతుంది. ఏజెన్సీలో గర్భిణులను గుర్తించి వారిని సకాలంలో కాన్పు కోసం పీహెచ్‌సీలకు తరలించాలనే ఐటీడీఏ అధికారి ఆలోచన కార్యరూపం దాల్చడం లేదు. ప్రధానంగా గర్భిణీలకు పౌష్టికాహారం అందకపోవడం శాపంగా మారుతోంది. ఏజెన్సీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 24 గంటలు ఆసుపత్రులుగా స్ధాయి పెంచిన వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ఫలితంగా రాత్రి సమయంలో అత్యవసర వైద్యం కోసం వచ్చిన రోగులకు అక్కడ ఉన్న సిబ్బంది సేవలే గతి.ఏజెన్సీలో దోమలు, లార్వా నివారణకు గ్రామాల్లో మలేరియా మందు పిచికారీ రెండో దశ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే రెండు రౌండ్లు మలేరియా మందు పిచికారీ పూర్తికావాలి. ఏజెన్సీలో 931 గ్రామాల్లో పిచికారీ పూర్తికా వాల్సి ఉండగా ప్రస్తుతం 636 గ్రా మాల్లో పూర్తి చేశారు. రంపచోడవ రం ఐటీడీఏ పరిధిలో గంగవరం, చవిటిదిబ్బలు, గుర్తేడు, వాడపల్లి, మారేడుమిల్లి పీహెచ్‌సీల పరిధి లోని కొన్ని గ్రామాల్లో మలేరియా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాడపల్లి పీహెచ్‌సీ పరిధిలో వాడపల్లి గ్రామంలో 602 మంది జ్వరాలు బారిన పడితే రక్త పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి మలేరియా ఉన్నట్లు నిర్ధారించారు. బూసిగూడెంలో 274 మందికి జ్వర పీడితులకు రక్త పరీక్షలు నిర్వహించగా పది మందికి మలేరియా ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో సీజనల్‌ వ్యాధులు విభృంజించే అవకాశం ఉంది.