అడ్డదారి పడుతున్న గ్యాస్ సిలెండర్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అడ్డదారి పడుతున్న గ్యాస్ సిలెండర్లు

హైద్రాబాద్, ఆగస్టు 20, (way2newstv.com)
హైదరాబాద్  నగరంలో పేదలకు నిత్యం సరఫరా చేసే వంటింటి గ్యాస్ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. నెల రోజుల్లో రెండుసార్లు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు తగ్గి రూ. 630లకు సరఫరా చేస్తుండటంతో వాణిజ్య అవసరాలకు గుట్టుచప్పడుగా అమ్మకాలు చేస్తున్నారు. ఏజెన్సీలకు చెందిన కొంత మంది సిబ్బంది. సివిల్ సప్లయి అధికారుల పర్యవేక్షణలోపం ఇష్టారాజ్యంగా చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో డొమెస్టిక్ కనెక్షన్లు 26.21 లక్షలు ఉన్నాయి. నగర వ్యాప్తంగా 135 ఏజెన్సీల ఉండగా వాటి ద్వారా ప్రతిరోజు 1.50లక్షల సిలిండర్ సరాఫరా చేయాలి. 
 అడ్డదారి పడుతున్న గ్యాస్ సిలెండర్లు

కానీ ప్రస్తుతం 74 వేలకు మించి ఇంటింటికి సరఫరా చేయడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. బుకింగ్ చేసుకున్న వారం రోజుల తరువాత గ్యాస్ సిలిండర్ వస్తుందని, ఎందుకు ఆలస్యం జరుగుతుందని అడిగితే ఫిల్లింగ్ స్టేషన్ నుంచి సరఫరా తక్కువగా ఉందని సమాధానం చెబుతూ జేబులు నింపుకుంటున్నారు.వాణిజ్య అవసరాలకు మాత్రం ఎలాంటి కొర్రీలు పెట్టకుండా బ్లాక్ మార్కెట్ ద్వారా సరఫరా చేస్తున్నారు. 5కేజిల సిలిండర్ ధర కూడా పెరిగింది. బహిరంగ మార్కెట్‌లో రూ. 340 ఉండగా, బ్లాక్ మార్కెట్‌లో రూ. 650 అమ్మకాలు చేస్తున్నారు. నిరుద్యోగులు, కళాశాల విద్యార్థులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తుండటంతో వచ్చిన అవకాశం వదలకుండా గల్లీలో విక్రయాలు సాగిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ల ధర కూడా భగ్గుమంటుంది. నాలుగు నెలల్లో రూ.180 వరకు పెరిగింది. 19కిలోల వాణిజ్య సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 1166కి చేరింది. వాణిజ్య కనెక్షన్లు 60వేలకు ఉండటంతో, వాటి ధర అధికంగా ఉండటం డొమెస్టిక్‌ది తక్కువ ఉండటంతో చిరువ్యాపారులైన చిన్నహోటళ్లు, టిఫిన్‌సెంటర్లు కన్నేశారు. బస్తీలో డబుల్ కనెక్షన్ ఉన్నవారిని మభ్యపెడుతూ ఎక్కువ ధర ఇస్తామని నమ్మిస్తూ వ్యాపారం చేస్తున్నారు.