ఆరోగ్య పథకాలకు సాయమందించండి: ఈటల - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆరోగ్య పథకాలకు సాయమందించండి: ఈటల

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో మంత్రి ఈటల భేటీ
న్యూఢిల్లీ ఆగష్టు 8  (way2newstv.com):
రాష్ట్రానికి సంబంధించిన పలు ఆరోగ్య పథకాలకు సాయమందించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను దిల్లీలో కలిసారు.. భేటీ అనంతరం ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు.హైదరాబాద్‌లో గాంధీ ఆసుపత్రి, నీలోఫర్ ఆసుపత్రిలో ‌సూపర్ స్పెషాలిటీ బ్లాకులు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాం. ఖమ్మం, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయాలని చెప్పాం.
ఆరోగ్య పథకాలకు సాయమందించండి: ఈటల

కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఆస్పత్రులను అప్ గ్రేడ్ చేయాల్సి ఉందని, అందుకు సహకరించాలని కోరాం. తెలంగాణలో 9 జిల్లాలలో ఆసుపత్రుల ఆధునికీకరణకు సహకరిస్తామని‌ కేంద్రమంత్రి చెప్పారు. రాష్ట్రంలో అదనపు డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు, జాతీయ రహదారుల పక్కన ట్రామా సెంటర్లను ఏర్పాటు, ఆరోగ్య శ్రీ, కేసీఆర్ కిట్ పథకాలకు సహకారం అందించాలని కోరాం. హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలు ప్రారంభించామని, గ్రామాల్లో ఉన్న వైద్య శిబిరాలను వెల్ నెస్ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని, ఎయిమ్స్ నిర్మాణం, సైన్స్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాం’’ అని ఈటల చెప్పారు.మంత్రి దృష్టికి ఎన్‌ఎంసీ బిల్లుఎన్‌ఎంసీ బిల్లు అంశాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఈటల వివరించారు. ఈ బిల్లు ద్వారా మేలే జరుగుతుందని, పీజీ వైద్య విద్యార్థులు అర్హత పొందే వరకు ఎన్నేళ్లయినా పరీక్ష రాయొచ్చని కేంద్రమంత్రి చెప్పారని ఈటల తెలిపారు. బిల్లు అర్థమైతే విద్యార్థులు సంతోషపడతారన్నారని ఈటల చెప్పారు. మరోవైపు వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల, ఆదిలాబాద్ రిమ్స్‌లో సూపర్‌ స్పెషాలిటీ బ్లాకులు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయని ఈటల వివరించారు.