వర్సిటీలకు వీసీలను నియమించకపోవడం..ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆగ్రహం
హైదరాబద్ ఆగష్టు 14 (way2newstv.com)
రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కళాశాలల్లో ప్రొఫెసర్లు, లెక్చరర్లు, పాఠశాలల్లో ఉపాధ్యాయులకొరత తీవ్రంగా ఉందని అయినప్పటికీ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయడంలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాబోధన సరిగ్గా జరిగేలా ఆ శాఖలోని ఉద్యోగాలను భర్తీ చేయాలని, అందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వర్సిటీలకు వీసీలను నియమించకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యమని, ఐఏఎ్‌సలతో వాటిని నడిపిస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. 
వర్సిటీలకు వీసీలను నియమించకపోవడం..ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం 

విద్యాశాఖలోని కొన్ని విభాగాల్లో 14 ఏళ్లుగా పదోన్నతులు లేవని, పాఠశాలలు, కళాశాలల్లో పర్యవేక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, విద్యాశాఖ మంత్రుల సొంత జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకొన్నాయని, పెచ్చులూడి పడి కొందరు విద్యార్థులు గాయపడిన ఘటనలూ ఉన్నాయని  వాపోయారు.విద్యాశాఖనునిర్వహించడంలోమంత్రివిఫలమయ్యారని, వెంటనే భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాయలసీమకు గోదావరి జలాలు తరలిస్తామంటూ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు, కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారుగాజులు చేయిస్తానన్నట్లుగా ఉందని లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. సింగూరు, నిజాంసాగర్‌లకు చుక్కనీరు రాకుండా భూములు బీడుపారుతుంటే పట్టించుకోని సీఎం, రాయలసీమను రతనాల సీమగామారుస్తారట అని విమర్శించారు.
Previous Post Next Post