నెల్లూరు, ఆగస్టు 7, (way2newstv.com)
బెల్ట్‌దుకాణాలపై చర్యలు చేపట్టారు. ఇప్పుడు మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్‌లు రద్దు వంటి కొత్త ఆలోచనలతో దశల వారీ మద్య నిషేధం దిశగా అడుగులేస్తున్నారు. కొత్త విధానంలో దుకాణం వద్ద మద్యంతాగేందుకు అవకాశం ఉండదు. ఇకపై మద్యం కొనుగోలు చేసి ఇంటికెళ్లి తాగాల్సిందే. మద్యానికి కొత్త పాలసీతో కొత్త రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఆదాయమే పరమావధిగా కాకుండా పేద, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమమమే లక్ష్యంగా చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మద్యం రక్కసిని దశల వారీగా దూరం చేసేందుకు ఒక్కో ప్రణాళికా రచిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను కొన్నాళ్లపాటు నడిపి దుకాణాల సంఖ్యను దశలవారీగా తగ్గించేందుకు గతంలోనే ప్రకటించింది.
మద్యం కొనుగోళ్లపై నిబంధనలు
ఇప్పుడు మరో ముందడుగు వేసి మద్యం దుకాణాల వద్ద ఇన్నాళ్లూ ఉన్న పర్మిట్ రూమ్‌ల విధానాన్ని రద్దు చేయనుంది. అక్టోబర్ 1 నుంచి అమలు కానున్న కొత్త మద్యం పాలసీలో ఈ విధానాన్ని తెరపైకి తేనున్నారు. దీంతో మద్యం తాగేందుకు షాపుకెళ్లి డబ్బులు కట్టి అక్కడే తాగేసి ఇంటికెళ్లే పరిస్థితులు మారనున్నాయి. మద్యం కొనుగోలు చేసి ఇంటికెళ్లాల్సిందే! లేదా బారుకెళ్లి అదనంగా చెల్లించుకుని కిక్కు ఎక్కించుకోవాల్సిందే! జిల్లా వ్యాప్తంగా 210 మద్యం దుకాణాలున్నాయి. మరో 28 బార్లున్నాయి. వీటి ద్వారా ప్రతీ నెలా సుమారు 60 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతోంది. ప్రతీ రోజూ రూ.2 నుంచి 4 కోట్ల మద్యం విక్రయాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే గత నెల 30తో పాత మద్యం పాలసీ విధానం ముగిసింది. కొత్త మద్యం పాలసీ విధానం వెంటనే అమల్లోకి రావాలి. కానీ ప్రభుత్వం మద్యం దశల వారీ నిషేధం హామీ వెనుక మూడు నెలల పాటు లైసెన్స్‌లను పొడిగించింది. ఈ లైసెన్సులను మూడు నెలల పాటు రెన్యువల్ చేసుకోవాలని ఇచ్చిన ప్రకటనలో జిల్లాలో 9 షాపులు ముందుకు రాలేదు. బెల్ట్‌షాపుల నిషేధం, పక్కా పాలసీ అమలు వంటి నిర్ణయాల కారణంగా ఆయా షాపుల యజమానులు ముందుకు రాలేదు. ఇప్పుడు కొత్తగా పర్మిట్‌రూమ్‌లను రద్దు చేయనుండటంతో మద్యం విక్రయాలు మరింత తగ్గే అవకాశముంది.కొత్త మద్యం పాలసీపై ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో కొత్త పాలసీలోని ప్రణాళికలు, ఇతర సూచనలూ చెబుతారు. అందరి ఎస్‌హెచ్‌ఓలతో సమావేశం నిర్వహించి కొత్త విధానంపై సిబ్బందికి కూడా అవగాహన కల్పిస్తాం. కొత్త విధానంలో పర్మిట్ రూమ్‌లు ఉండవు. కావాల్సిన వారు మద్యం కొనుగోలు చేసి ఇంటికెళ్లి తాగాల్సిందే.
Tags:
Andrapradeshnews