మాఫీ చుట్టూ అక్రమాలే..(నిజామాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మాఫీ చుట్టూ అక్రమాలే..(నిజామాబాద్)

నిజామాబాద్, ఆగస్టు 28 (way2newstv.com):
ప్రభుత్వం పంట రుణ మాఫీ ప్రకటన బ్యాంకర్లను అక్రమాల బాటపట్టిస్తోంది. బోగస్‌ పత్రాలు సృష్టించి రుణాలు పొందుతున్న అక్రమార్కులు తర్వాత మాఫీ అర్హత పొందుతున్నారు. గ్రామాల్లోని చోటామోటా నాయకులు దళారుల అవతారం ఎత్తుతున్నారు. బ్యాంకు అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి రాయితీ వచ్చే పథకాల కింద రుణాలు ఇప్పిస్తున్నారు. ఎక్కువ ప్రయోజనం కలిగే పంట  రుణాలపై వీరు దృష్టి సారించారు. కొంతకాలంగా ఇదే దందా కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన తెరాస సర్కారు రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ చేసింది. మొన్నటి శాసనసభ ఎన్నికలకు ముందు ప్రధాన రాజకీయ పార్టీలు రుణ మాఫీ ప్రకటన చేశాయి. 
మాఫీ చుట్టూ అక్రమాలే..(నిజామాబాద్)

తీసుకున్న డబ్బు మాఫీ అవుతుందనే భావనతో ప్రతి రైతు పంట రుణం తీసుకున్నారు. ఈ క్రమంలో బ్యాంకర్లు, దళారులు కలిసి మరోసారి అవినీతికి తెర లేపారు. కొందరు రెవెన్యూ అధికారులకు ఇందులో భాగస్వామ్యం ఉంది. సర్వే నంబరు అందులోని భూమి విస్తీర్ణం ఎప్పటికీ మారదు. అయితే బైనంబర్లతో రైతుల పేర్లు మార్చి కొత్త పుస్తకాలు జారీ చేశారు. వాటి ఆధారంగా రూ.లక్షల్లో పంట రుణాలు అందాయి. మాఫీ తర్వాత ఎవరికీ ఇబ్బంది ఉండదనే అంచనాతో రెవెన్యూ, బ్యాంకర్లు, దళారులు కలిసి దందా నడిపారు.రాష్ట్ర బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) నిర్దేశించిన రీతిలో ఏటా వ్యవసాయ పంటలకు రుణాలు ఇస్తారు. వీటిని మంజూరు చేయడానికి బ్యాంకర్లు రైతు పట్టాదారు పాసు పుస్తకాన్ని ప్రమాణికం చేసుకుంటారు. పహాణీ పత్రాన్ని వీఆర్వో జారీ చేసి సాగు చేస్తున్న పంట, భూమి విస్తీర్ణాన్ని నిర్ధరిస్తారు. ఉప తహసీల్దారు/తహసీల్దారు అటెస్టెడ్‌ సంతకంతో బ్యాంకులకు పహాణీలు రైతుల ద్వారా అందుతాయి. రుణం మంజూరు చేయడానికి ముందు వాటి నిర్ధరణకు బ్యాంకు ఫీల్డు అధికారి తహసీల్‌ కార్యాలయానికి వెళ్లాలి. విచారణ చేపట్టి బోగస్‌ అని తేలితే పోలీసు కేసు నమోదు చేయాలి. కానీ ఇలా ఎక్కడా చేయడంలేదు.