శాంతించిన కృష్ణమ్మ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శాంతించిన కృష్ణమ్మ

జలాశయాలకు తగ్గుతున్న వరద ప్రవాహం
శ్రీశైలం  ఆగష్టు 19 (way2newstv.com)
 కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణానదికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జూరాల జలాశయం ఇన్‌ఫ్లో 3.54 లక్షల క్యూసెక్కులుకాగా.. 21 గేట్లద్వారా 3.39 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 8.434 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 317.910  మీటర్లకుగానూ.. ప్రస్తుతం 213.516 మీటర్లుగా ఉంది. శ్రీశైలం జలాశయనికీ వరద క్రమంగా తగ్గుతోంది. ఇన్‌ఫ్లో 4.65 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 3.79 లక్షలుగా నమోదైంది. జలాశయపూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా.. ప్రస్తుత నీటిమట్టం 882.30 అడుగులుగా ఉంది. 
శాంతించిన కృష్ణమ్మ

ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 215.81 టీఎంసీలకుగానూ.. ప్రస్తుతం 200.65 టీఎంసీల నీరు ఉంది. కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 30,931 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 42వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2,400 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,026 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 34 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శ్రీశైలం 10 గేట్లను పైకెత్తి 2,68,717 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. మరోవైపు నాగార్జునసాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం భారీగా తగ్గింది. జలాశయానికి 3.19 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. అంతేమొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 586.50 అడుగులుగా ఉంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటినిల్వ 312 టీఎంసీలకుగానూ.. ప్రస్తుతం 302.91 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్‌ 26 గేట్లను ఎత్తి 2.66 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.