డోలాయామనంలో ఇమ్రాన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డోలాయామనంలో ఇమ్రాన్

న్యూఢిల్లీ, ఆగస్టు 29, (way2newstv.com)
డెబ్బయ్యేళ్ళ భారత్ వేరు, కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక పాలన వేరు. ఇంతవరకూ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యధిక‌కాలం పాలించింది. కాంగ్రెస్ పాలసీ ప్రకారం ముస్లిం సమాజాన్ని బుజ్జగింపులతోనే సరిపుచ్చుతూ వెళ్ళింది. అందువల్ల కాంగ్రెస్ అధినాయకుడు నెహ్రూ విధానాలనే కాంగ్రెస్ తుచ తప్పకుండా అనుసరించింది. అదే కాంగ్రెస్ కు శరణ్యం కూడా. ఇక 1950ల్లోనే పుట్టిన నేటి బీజేపీకి పూర్వ రూపం జనసంఘ్ కి కాశ్మీర్ విషయంలో కచ్చితమైన ఆలోచనలు ఉన్నాయి. కాశ్మీర్ కి 370 ఆర్టికల్ తో పాటు ప్రత్యేక ప్రతిపత్తిని వ్యతిరేకించినది జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ. ఆయన ఈ కారణంగానే కాశ్మీర్ వరకూ వెళ్ళి అక్కడ అనుమానస్పద స్థితిలో బలిదానం అయ్యారు. 
డోలాయామనంలో ఇమ్రాన్

దేశంలో సంకీర్ణాల‌ యుగంలో సైతం కాంగ్రేసేతర ప్రధానులు ప్రభుత్వాలు కాపాడుకునేందుకే ప్రాముఖ్యత ఇచ్చారు. మరో వైపు కాశ్మీర్ పై అన్నీ తెలిసిన వాజ్ పేయ్ ప్రధానిగా ఆరేళ్ల కాలం పనిచేసినా కూడా కాశ్మీర్ సమస్యను కదపపోవడానికి ఆయనకు ఉన్న సంకీర్ణ సర్కార్ సంకెళ్ళు పరిమితులేనన్నది అందరికీ తెలిసిందే. మొత్తానికి 2014 తరువాత మాత్రమే దేశ రాజకీయాల్లో నూతన శకం ఆరంభం అయిందనుకోవాలి.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొత్త కాదు, కానీ 2014లో పూర్తి మెజారిటీతో సర్కార్ ఏర్పాటు చేయడమే కీలకమైన మార్పు. దీన్ని వేగంగ‌నే గుర్తించినా పాక్ తన జాగ్రత్తలో తాను ఉండలేకపోయింది. ఎప్పటిమాదిరిగానే కాశ్మీర్లో కల్లోలానికి తెర లేపింది. నరేంద్ర మోడీని కూడా వాజ్ పేయ్ మాదిరిగానే భావించింది. భారత్ లోని కుహనా లౌకిక వాదులపైనా, పార్టీల పైన పెద్ద ఆశలు పెట్టుంది. అందువల్లే నరేంద్ర మోడీ తొలి అయిదేళ్ల పాలనలో సరిహద్దులో జరిగిన అల్లరులు, ఉద్రిక్తత‌లు అన్నీ ఇన్నీ కావు. నరేంద్ర మోడీ సైతం పార్టీ విధాలను ఎలా ఉన్నా తొలుత మైత్రి కోసమే చేతులు చాచారు. అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట హఠాత్తుగా ప్రత్యక్షమై తేనీటి విందు దౌత్యం నెరిపారు. ఆ తరువాత తెలిసింది నరేంద్ర మోడీది కురుక్షేత్రంలో క్రుష్ణుడి రాయబారమని, పాక్ వంకర బుద్ధి మారదని తెలిసినా తాను చెడ్డ కాకుండా మోడీ అలా చేశారని, ఆ తరువాత మోడీ ఇక ఆగలేదు. పాక్ పై కఠిన వైఖరితో దూసుకుపోయారు చివరికి బాల్ కోట్ మెరుపు దాడుల‌తో తొలి అయిదేళ్ల పాలనను ముగించారు.ఇదిలా ఉండగా రెండవమారు సైతం రెట్టింపు మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ మూడు నెలలు తిరగకుండానే పాక్ పీచమణిచే నిర్ణయం వేగంగా తీసుకున్నారు. జనసంఘ్ అత్యంత కీలకమైన రాజకీయ విధానమైన 370 ఆర్టికల్ ని రద్దు చేయడమే కాదు కాశ్మీర్ ని రెండు ముక్కలుగా విడగొట్టి పాక్ నడుం విరిగేలా దెబ్బ కొట్టారు. ఇక పాక్ కి అంతర్జాతీయ సమాజం మద్దతు లేకుండా తొలి అయిదేళ్ళు మోడీ చేసిన విదేశీ యాత్రలు, రాయబారాలు అక్కరకు వచ్చాయి. ఇపుడు కాశ్మీర్ తన క‌ళ్ల ముందే భారత్ లో అంతర్భాగం కావడాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. అరబ్ దేశాలతో పాటు, అమెరికా వంటి పెద్ద దేశం కూడా మద్దతు ఇవ్వడానికి వెనకడుగు వేసిన వేళ పూర్తి నిస్పృహ‌తో పాక్ మాటలు ఉంటున్నాయి.ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా చేసిన ప్రకటన‌ వింటే పాక్ భయపడుతోందా, భయపెడుతోందా అన్న సందేహాలు వస్తాయి. కాశ్మీర్ కోసం అవసరమైతే అణు యుధ్ధం చేస్తామని పాక్ అనడాన్ని విచ్చినకరమైన ఆలోచనగా చెప్పుకోవాలి. అణుయుధ్ధం అంటే బొమ్మలాట అనుకుంటున్న పాక్ తన పరువు మరింత తగ్గించుకుంటూ దిగజారి మాట్లాడుతోందని అంటున్నారు. పాక్ అణు యుధ్ధం అన్నా మరోటి అన్నా కూడా ప్రపంచం చూస్తూ వూరుకోదు, నరేంద్ర మోడీ అంతకంటే వూరుకోరు. నరేంద్ర మోడీ టార్గెట్ ఆక్రమిత కాశ్మీర్, మళ్ళీ మాట్లాడితే లాహోర్ దాకా సైన్యాన్ని ఉరికించి అయినా పాక్ కి శాశ్వతంగా గుణపాఠం చెప్పేలా నరేంద్ర మోడీవ్యూహాలు రచిస్తున్న వేళ పాక్ వి సంధి ప్రేలాపనలు అనుకోవాలేమో.