గ్రామీణ వ్యవస్థను పటిష్టపరచడమే ప్రభుత్వ లక్ష్యం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గ్రామీణ వ్యవస్థను పటిష్టపరచడమే ప్రభుత్వ లక్ష్యం

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  
ములుగు ఆగస్టు 7  (way2newstv.com)
గ్రామీణ వ్యవస్థను పటిష్టపరచడమే ప్రభుత్వ లక్ష్యం  రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  రాష్ట్రంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు గ్రామీణ వ్యవస్థను పటిష్టపరచడమె సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇ. ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.  బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత జిల్లా కేంద్రంలో నిర్మించిన జడ్పీ కార్యాలయ భవనాన్ని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణ రెడ్డి ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ లతో కలిసి ప్రారంభించారు.
గ్రామీణ వ్యవస్థను పటిష్టపరచడమే ప్రభుత్వ లక్ష్యం 

అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ములుగు జిల్లా తొలి జడ్పీ సర్వసభ్య సమావేశానికి మంత్రి హాజరయ్యారు. కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తొలుత జడ్పిటిసి ల ప్రమాణస్వీకారం పూర్తి చేశారు. అనంతరం జడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం మంత్రి దయాకర్రావు సమక్షంలో కలెక్టర్ నారాయణ రెడ్డి  ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ములుగు జిల్లాను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి ఇచ్చిన మాట ప్రకారం జిల్లాను ఏర్పాటు చేసి అభివృద్ధి పనుల్లో లో అన్ని రంగాల్లో ముందుకు నడిపించేందుకు డైనమిక్ కలెక్టర్ నారాయణరెడ్డి నియమించి జిల్లా అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారనీ అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం లో భాగంగానే పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ చట్టాన్ని పునర్వ్యవస్థీకరించి ప్రజాప్రతినిధులకు ఎంతో విలువైన అధికారాన్ని కట్టబెట్టారనీ అన్నారు. గ్రామ పరిపాలన వ్యవస్థను పటిష్ట పరిచేందుకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు సర్పంచులకు వార్డు సభ్యులకు ఎంపీటీసీ లకు విశేష అధికారాలను కల్పించారన్నారు. గతంలో నిర్వీర్యమైన పంచాయతీరాజ్ వ్యవస్థను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కెసిఆర్ నేతృత్వంలో లో నూతన చట్టాన్ని రూపొందించి దానిని అమలు పరిచేందుకు కఠిన నిర్ణయాలు సైతం తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఖాళీలను భర్తీ చేసి ఉద్యోగులకు జీతాలు పెంచేందుకు సైతం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ములుగు జిల్లా  సర్వతోముఖాభివృద్ధికి ప్రజా ప్రతినిధులు కృషి చేస్తూ కలెక్టర్ నేతృత్వంలో అభివృద్ధి పనులలో భాగస్వాములు అవుతూ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.